'కిరణ్ ఫోన్ చేసినందునే... భేటీకి' | Sakshi
Sakshi News home page

'కిరణ్ ఫోన్ చేసినందునే... భేటీకి'

Published Sun, Feb 23 2014 12:02 PM

'కిరణ్ ఫోన్ చేసినందునే... భేటీకి' - Sakshi

హైదరాబాద్ : కొత్త పార్టీ ఏర్పాటుపై ఇప్పుడే చెప్పలేమని... మరో రెండు, మూడు రోజుల్లో స్పష్టత వస్తుందని కాంగ్రెస్ బహిష్కృత ఎంపీ సబ్బం హరి అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ఆదివారం కాంగ్రెస్ బహిష్కృత ఎంపీలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కొత్త పార్టీ పెట్టాలా, వద్దా అనే అంశంతో పాటు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనట్లు తెలుస్తోంది.

ఈ భేటీకి ముందు అనంతరం సబ్బం హరి మాట్లాడుతూ కిరణ్ కుమార్ రెడ్డి   ఫోన్ చేసినందునే సమాశానికి హాజరు అవుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో జాతీయ పార్టీల ప్రభావతం తగ్గినట్లు కనిపిస్తోందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో రెండు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయని, మూడో ప్రాంతీయ పార్టీగా వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో ఇప్పుడే చెప్పలేమన్నారు. రాష్ట్ర విభజన అనంతర పరిణామాలను పూర్తిగా అంచనా వేస్తామన్నారు. ఈ భేటీకి సబ్బం హరి, రాయపాటి సాంబశివరావు, లగడపాటి రాజగోపాల్, సాయిప్రతాప్, హర్షకుమార్, ఉండవల్లి అరుణ్ కుమార్, మంత్రులు పితాని సత్యనారాయణ, శైలజానాథ్, పార్థసారధి తదితరులు హాజరు అయ్యారు.

మరోవైపు కిరణ్‌కుమార్‌రెడ్డి తన రాజకీయ భవితవ్యంపై ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. కొత్త పార్టీ పెట్టాలా, వద్దా... పెడితే తనతో పాటు ఎంతమంది ఉంటారు... ప్రజలు ఆదరిస్తారా, లేదా అన్న మీమాంస మధ్య గత రెండు రోజులుగా ఆయన తన సన్నిహితులతో ముమ్మరంగా మంతనాలు జరుపుతున్నారు.

Advertisement
Advertisement