Sakshi News home page

గ్యాస్ కనెక్షన్ల జాతర

Published Sat, Apr 4 2015 1:59 AM

గ్యాస్ కనెక్షన్ల జాతర

ఎంపికలోనూ మారని తీరు
జన్మభూమి కమిటీలదే పెత్తనం
నెలాఖరులోగా ఎంపిక ప్రక్రియ పూర్తి

 
ఒకవైపు ఉచితం..మరొక వైపు దీపం..జిల్లాకు గ్యాస్ కనెక్షన్లు భారీ సంఖ్యలో మంజూరయ్యాయి. అదేస్థాయిలో దరఖాస్తులు వెల్లువెత్తాయి. కానీ వీటి ఎంపికలో మాత్రం ఒక వైపు జన్మభూమి కమిటీలు పెత్తనం చెలాయిస్తుంటే..మరొక వైపు అధికారులు, కమిటీలు చేతివాటం ప్రదర్శిస్తున్నాయి.

సాక్షి, విశాఖపట్నం : జిల్లాకు సామాజిక బాధ్యత పథకం(సీఎస్‌ఆర్) కింద 1.2లక్షల గ్యాస్ కనెక్షన్లు మంజూరయ్యాయి. ఇవన్నీ ఉచితంగా పంపిణీ చేయాలని కేంద్రం సంకల్పించింది. ఉచిత కనెక్షన్ల కోసం ఎంపిక ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లోనే చేపట్టారు. వీటికోసం 1,31,518 దరఖాస్తులు వచ్చాయి. జీవీఎంసీ,ఇతర మున్సిపాల్టీలతో పాటు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన 1,17,171 దరఖాస్తులను ఏఎస్‌వో, సీఎస్‌డీటీలు పరిశీలించారు.

ఇంకా 54,210 దరఖాస్తులను పరిశీలించాల్సి ఉంది. 1132 దరఖాస్తులను తిరస్కరించారు. ఏజెన్సీ పరిధిలో 42,910 దరఖాస్తులకు15,735 దరఖాస్తులను ఆమోదించారు. సాంకేతికకారణాలతో ఉన్నతాధికారులకు సిఫారసు చేసిన దరఖాస్తులు 14,347 ఉన్నాయి. ఏఎస్‌వో, సీఎస్‌డీటీలు అప్రూవ్ చేసిన 59,376 దరఖాస్తుదారులకు ఇప్పటికే వారి సెల్‌ఫోన్ నంబర్లకు మెసేజ్‌లు కూడా పంపుతున్నారు. వారికి ఏ ఏజెన్సీ పరిధిలో గ్యాస్‌కనెక్షన్ మంజూరైంది..ఎప్పటిలోగా తీసుకోవాలన్నది తెలియజేస్తూ ఈ మెసేజ్‌లు వస్తున్నాయి.

వీటి విషయంలో జా యింట్ కలెక్టర్ జనార్దనన్ నివాస్ ప్ర త్యేక శ్రద్ధతో 60శాతం ఎంపిక పారదర్శకంగానే సాగింది. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల సిఫారసు మేరకు స్థానిక అధికారులు ఆన్‌లైన్‌లో వారే స్వయంగా దరఖాస్తులను అప్‌లోడ్ చేసి ఆమోదించారన్న వాదన ఉంది. గ్యాస్‌కనెక్షన్‌లేకపోవడం..తెలుపుకార్డు, ఆధార్ కార్డు కలిగి ఉండడం దీనికి ప్రామాణికంగా పెట్టారు. జిల్లాలో కార్డులు...వాటి పరిధిలో ఉన్న యూనిట్ల సంఖ్యను బట్టి చూస్తే మధ్యతరగతి, ఎగువ మధ్య తరగతితో పాటు ఉన్నత వర్గాలకు చెందిన వేలాది మందికితెలుపుకార్డులున్నాయి.

దీంతో పలువురు అధికారుల అండదండలతో ఉచిత కనెక్షన్లు పొందినట్టు తెలుస్తోంది. ఇలా సుమారు 30 శాతం పక్కదారి పట్టే పరిస్థితి చోటుచేసుకుంది. నెలాఖరులోగా ఉచితగ్యాస్ కనెక్షన్ల కోసం ఎంపికతో పాటుమంజూరు ప్రక్రియ కూడా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. ప్రభుత్వం జిల్లాకు  25వేల దీపం కనెక్షన్లను మంజూరు చేసింది. నర్సీపట్నానికి 3,500, అనకాపల్లి, చోడవరానికి 1500 చొప్పున, యలమంచలి, గాజువాక, పెందుర్తి నియోజక వర్గాలకు వెయ్యేసి చొప్పున అదనంగా గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఉచిత కనెక్షన్ల జారీ కొంత వరకు పారదర్శకంగా జరిగిన ప్పటికీ దీపం కనెక్షన్ల లబ్ధిదారుల ఎంపిక మాత్రం అంతాలోపభూయిష్టంగా సాగుతోంది. ఇది తెలుగుతమ్ముళ్లకు వరంగా మారింది. పేరుకు ఏఎస్‌వో,రెవెన్యూఅధికారులకు ఎంపిక బాధ్యత ఇచ్చినప్పటికీ జన్మభూమి కమిటీల ఆమోదంతోనే ఎంపిక చేయాలన్న మెలికతో పెత్తనమంతా వారి చేతిలో పెట్టినట్టయింది. మార్చి నెలాఖరులోగానే వీటి ఎంపిక పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ గ్రామస్థాయిలో ఎంపికలో చోటు చేసుకుంటున్న రాజకీయాల వల్ల తీవ్ర జాప్యంజరుగుతోంది.

ఎమ్మెల్యేలు ఇచ్చిన జాబితాలకు జన్మభూమికమిటీలు ఆమోద ముద్ర వేస్తుండడంతో అధికారుల ఎంపిక చేసిన జాబితాలు బుట్టదాఖలవుతున్నాయి. జన్మభూమి కమిటీల మితిమీరిన జోక్యం వల్ల అధికారులుతీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అర్హత ఉన్నా లేకున్నా ఎమ్మెల్యే చెప్పారు.. చేయాల్సిందే  దోరణిలో ఈ కమిటీలు పెత్తనంతో ఎంపికలో అధికారులు మిన్నకుండిపోవాల్సి వస్తుంది. ఈ ప్రక్రియను నెలాఖరులోగా పూర్తిచేయాలన్న పట్టుదలతో అధికారులు పనిచేస్తున్నప్పటికీ కమిటీలు గంటకో జాబితాతో గందరగోళానికి గురిచేస్తున్నారు. ఇదే అదనుగా కొందరు అధికారులు ఎంపికలో చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Advertisement
Advertisement