నాలుగు డిగ్రీలున్నా ఉద్యోగం లేదు | Sakshi
Sakshi News home page

నాలుగు డిగ్రీలున్నా ఉద్యోగం లేదు

Published Fri, Jul 29 2016 10:26 PM

నాలుగు డిగ్రీలున్నా ఉద్యోగం లేదు - Sakshi

అనంతపురం : ‘ప్రభుత్వం ఉద్యోగం వస్తుందని కొండంత ఆశతో ఓట్లేశాం. ఉద్యోగం రాకపోతే నిరుద్యోగ భతి అయినా వస్తుందని ఎదురు చూశాం. ఏమీ లేదు. ప్రైవేట్‌గా పని చేసుకుంటున్నా. చేతిలో నాలుగు డిగ్రీలున్నా(ఎంబీఏ, ఎంకాం,ఎంఏ, బీఈడీ) ఉద్యోగం లేదు’ అని నగరానికి చెందిన మురళీ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ‘గడప గడపకు వైఎస్సార్‌’ కార్యక్రమం 9వ డివిజన్‌లోని భవానీ నగర్‌లో జరిగింది.  పార్టీ అనంతపురం నియోజకవర్గ సమన్వయకర్త గురునాథ్‌ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ క్రమశిక్షణా సంఘం సభ్యులు ఎర్రిస్వామి రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి బుర్రా సురేష్‌ గౌడ్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు రాగే పరుశురాం, నదీమ్‌ అహ్మద్‌లు పాల్గొన్నారు.

ఎన్నికల్లో చంద్రబాబు  ఇచ్చి హామీల ఏ మేరకు అమలయ్యాయో మార్కులు వేయాలంటూ బ్యాలెట్లను పంచిపెట్టారు. ఈ సందర్భంగా డివిజన్‌లో అధిక సంఖ్యలో ప్రజలు టీడీపీ పాలనపై మండిపడ్డారు. ప్రకాష్‌ అనే స్థానికుడు మాట్లాడుతూ, ఎమ్మెస్సీ చేసిన ఉద్యోగం లేక చివరకు చిన్న వ్యాపారం చేసుకుంటున్నానని, సీఎం చంద్రబాబు మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయేషా అనే మహిళా డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని దగా చేశారన్నారు.

రుణ మాఫీ అవుతుందని వేచి ఉన్నందుకు రూ.4 వేలు వడ్డీ రూపంలో చెల్లించానని ఆవేదన వ్యక్తం చేశారు. వెంకట్రాముడు అనే విశ్రాంత ఉద్యోగి చంద్రబాబు సీఎం అందరి నోళ్లు కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు రంగంపేట గోపాల్‌ రెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కనేకల్‌ లింగారెడ్డి, డాక్టర్‌ మైనుద్దీన్, సేవాదళ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలనరసింహా రెడ్డి, ఎస్టీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రుద్రంపేట పురుషోత్తం, డీలర్ల సంఘం నగర మాజీ అధ్యక్షుడు బాలనాగిరెడ్డి,  కార్పొరేటర్‌ జానకి, వివిధ డివిజన్ల  కన్వీనర్లు సత్యనారాయణ రెడ్డి, బిందెల శీన, శేషానంద రెడ్డి, విశ్వనాథ్, చంద్రమోహన్‌ రెడ్డి, రమణ, నాగార్జున రెడ్డి, స్థానిక నాయకులు మార్కెట్‌ మల్లి, సుబ్బరాయుడు, లక్ష్మినారాయణ, మంగలి ప్రసాద్, బాబూ నాయక్, రామ్,లక్ష్మణ్‌ కమల్‌   పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement