హమీలు గాలికొదిలిన సీఎం | Sakshi
Sakshi News home page

హమీలు గాలికొదిలిన సీఎం

Published Tue, Oct 14 2014 3:06 AM

Hamilu galikodilina CM

సీపీఎం జిల్లా కార్యదర్శి చండ్ర
 
 నెల్లూరు(పొగతోట): ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు గాలికొదిలేశారని సీపీఎం జిల్లా కార్యదర్శి చండ్ర రాజగోపాల్ ఆరోపించారు. హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.  ఆయన మాట్లాడుతూ రైతుల రుణాలు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తాని ప్రజలకు హామీ ఇచ్చి టీడీపీ అధికారంలోకి వచ్చిందన్నారు.

అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి బుద్ధి బయటపడిందన్నారు. ప్రజలను నమ్మించి మో సం చేస్తున్నారన్నారు. ఎటువంటి షరతులు లేకుండా రైతు రుణాలు మాఫీ చేసి కొత్త రుణాలు మంజూరు చేయాలన్నారు. రుణమాఫీని కుదించే జీఓ 174ను సవరించాలన్నారు. హామీలు అమలు చేయని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని కోరుతూ డీఆర్‌ఓ నాగేశ్వరరావుకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు రమేష్, మదాల వెంకటేశ్వర్లు, ఆంజనేయులు, రామరాజు పాల్గొన్నారు.

Advertisement
Advertisement