వ్యవసాయ ‘ఉచితం’కు నియంత్రణలు | Sakshi
Sakshi News home page

వ్యవసాయ ‘ఉచితం’కు నియంత్రణలు

Published Sat, Apr 8 2017 12:54 AM

వ్యవసాయ ‘ఉచితం’కు నియంత్రణలు - Sakshi

ఉచిత విద్యుత్‌ కనెక్షన్లను తగ్గించాలి: సీఎం బాబు

సాక్షి, అమరావతి: వ్యవసాయ ఉచిత విద్యుత్‌ను నియంత్రణ చట్రంలోకి తేవాలని సీఎం చంద్రబాబు అధికారులకు హితబోధ చేశారు. 2.5 ఎకరాలకు మించి పంపుసెట్లు వాడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని సూచించారు. దీన్ని కూడా విద్యుత్‌ చౌర్యంగానే పరిగణించాలన్నారు. జియోట్యాగింగ్‌ పరిధిలో లేని వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్‌ సరఫరా నిలిపేయాలన్న సూచనను ముందుకుతెచ్చారు. తద్వారా ఉచిత విద్యుత్‌ కనెక్షన్లను తగ్గించాల ని సూచించారు.

విద్యుత్‌రంగ పరిస్థితిపై వెలగపూడిలో శుక్రవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మరోవైపు పౌర సేవలకోసం ఈ నెల 20న కాల్‌సెంటర్‌ వ్యవస్థను అందుబాటు లోకి తీసుకురానున్నట్లు సీఎం తెలిపారు. ఇందుకు సంబంధించిన పనులను 19వ తేదీ కల్లా పూర్తి చేయాలని ఈ ఏర్పాట్లు చేస్తున్న సిటిజన్‌ ఎక్స్‌పీరియన్స్‌ మేనేజ్‌మెంట్‌ సెంటర్‌ అధికారులను ఆదేశించారు.

Advertisement
Advertisement