ఆడిట్ తలంటు | Sakshi
Sakshi News home page

ఆడిట్ తలంటు

Published Mon, Feb 17 2014 1:32 AM

ఆడిట్ తలంటు

  •     ఆర్థిక నిర్వహణ ఇంత అస్తవ్యస్తమా?
  •      జెడ్పీ, మున్సిపాలిటీ, పంచాయతీలకు చురకలు
  •      బాధ్యతారాహిత్యంపై ఆడిట్ శాఖ మొట్టికాయలు
  •      మూడేళ్ల కిందటి నిర్వాకంపై అక్షింతలు
  •  సాక్షి, విశాఖపట్నం: ప్రజాధనమైతే చాలు.. బాధ్యతా రాహిత్యం కట్టలు తెంచుకుంటంది. అధికారుల నిర్లక్ష్యం ఉప్పెనలా పొంగిపొర్లుతుంది. అవినీతి, అక్రమాలకైతే ఇక అంతే ఉండ దు.. దాంతో కోట్ల కొద్దీ విలువైన నిధులు పక్కదారి పడతాయి. లేదా ప్రజలకు పనికి రాకుండా వృథా అవుతాయి. మూలనపడి మూలుగుతా యి. జిల్లాలో ప్రజాసంక్షేమం కోసం పని చేస్తున్నామని చెప్పుకునే వివిధ ప్రభుత్వ శాఖలు ఈ తరహా వక్ర ధోరణులను ప్రదర్శించాయి. ఆడి ట్ శాఖకు అడ్డంగా దొరికిపోయాయి.

    జీవీఎం సీ, జిల్లాపరిషత్,మున్సిపాల్టీలు, పంచాయతీలు,మండల పరిషత్‌లలో ప్రజాసంక్షేమానికి ఖర్చుచేయాల్సిన నిధుల విషయంలో నిర్లక్ష్యం గా వ్యవహరించి ఖజానాకు నష్టం కలిగించి ఆడిట్ విభాగం ఆగ్రహానికి గురయ్యాయి. జీవీ ఎంసీ, భీమునిపట్నం,అనకాపల్లి మున్సిపాల్టీ లు చేతికి వచ్చిన నిధులను వినియోగించకుండా,ఉన్న వాటిని ఇష్టానుసారం వాడుకుంటున్నాయన్న విమర్శలు ఎదుర్కొన్నాయి.

    ఆడిట్ శాఖ తాజాగా రూపొందించిన నివేదికలో, జిల్లాలో 2010-2011 సంవత్సరానికి సంబంధించిన నిధుల అపసవ్య వినియోగాన్ని తూర్పారబట్టింది. ఇష్టానుసారంగా వాడుకున్న నిధులను తక్షణమే రాబట్టాలని ఆదేశించింది. ఈ సంస్థల వ్యవహారశైలిపై మొత్తం 998  అభ్యంతరాలు వ్యక్తంచేసి లెక్కలపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది.
     
    అవకతవకలు
    పైశాఖలన్నిటిలో కలిపి రూ. 28 కోట్ల మేరకు లెక్కలు తేలలేదని ఆడిట్ శాఖ స్పష్టంచేసింది. జీవీఎంసీతో కలిపి మొ త్తం రూ.7.25 కోట్ల మేరకు బకాయిలు వసూలుచేయలేదని స్పష్టం చేసింది.

    సొంత దుకాణాల సముదాయాల ద్వా రా జిల్లాపరిషత్‌కు రూ.1.68 లక్షలు అద్దెల రూపంలో ఆదాయం రావలసి ఉన్నా వసూలుచేయలేదు. ఓ బ్యాంకు కు భవనానికి అద్దెగా రూ.53,400రావలసి ఉన్నా వసూలుచేయలేదు. రూ.1.48 లక్షల నిధులను జిల్లాపరిష త్ అధికారులు ప్రయాణ భత్యం పేరు తో తీసుకున్నారు. ఇవి మళ్లీ వసూలు కాలేదు.

    జిల్లా పరిషత్ రూ.7.49 లక్షలకు సం బంధించిన  ఖర్చుల వివరాలు తెలపకపోవడంపై ఆడిట్ శాఖ అభ్యంతరం చెప్పింది. మునగపాక మండల పరిష త్  రూ. 2.25 లక్షల ఖర్చుల వివరాలు ఇవ్వలేదని తెలిపింది.

    బుచ్చయ్యపేట మండలపరిషత్ రూ. 8,720ను అనవసరంగా ప్రచార ఖర్చులకు ఖర్చు చేయగా, ఈ నిధులను రాబట్టాలని ఆదేశించింది.
     
     పంచాతీయరాజ్ సంస్థల్లో రూ. 28 కోట్లకు సంబంధించి ఖాతాల్లో లెక్కల కు 998 అభ్యంతరాలు వ్యక్తంచేసింది. ఈసంస్థలు మొత్తం వివిధ విభాగాల్లో రూ.1.09కోట్లను  అధికంగా వినియోగించాయి. జిల్లాపరిషత్,గ్రామపంచాయతీలు,మండల పరిషత్‌లు మొత్తం రూ.12లక్షల నిధులు మళ్లించాయి.
     
     జిల్లాపరిషత్,పంచాయతీలు,మండలపరిషత్‌లు కలిసి 2010-2011 ఏడాదిలో తనకు రావలసిన మొత్తం రూ. 4.25 కోట్ల ఆదాయాన్ని వసూలుచేయకుండా వదిలేశాయి. ఇందులో రూ.4.18 కోట్లు కేవలం పంచాయతీల బకాయిలే. అలాగే రూ.4.56కోట్లను అడ్వాన్స్‌లు, సర్దుబాటు పేరుతో పెం డింగ్‌లు ఉంచాయి. మరో రూ.9.34కోట్లకు రికార్డులు సమర్పించలేదు.
     
     అనకాపల్లి మున్సిపాల్టీ తనపరిధిలోని కేబుల్ ఆపరేటర్లనుంచి వినోదపన్నుకింద వసూలుచేయాల్సిన పన్నులు వసూలు చేయలేదు.  
     
     నర్సీపట్నం మార్కెట్ కమిటీ తనకు రా వలసిన రూ.1.02లక్షల అద్దెను వసూ లు చేయడంలో నిర్లక్ష్యం వహించింది.
     

Advertisement
Advertisement