ఇసుక పోగులు, పొక్లెయిన్ సీజ్ | Sakshi
Sakshi News home page

ఇసుక పోగులు, పొక్లెయిన్ సీజ్

Published Wed, Mar 16 2016 11:27 PM

Heaps of sand, pokleyin Siege

 సోంపేట: మహేంద్రతనయ నదిలో ఇసుక దోపిడీపై అధికారులు స్పందించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు టెక్కలి ఆర్డీవో, తహశీల్దార్‌లు బుధవారం దాడులు చేశారు. నిల్వ చేసిన ఇసుక, పొక్లెయిన్‌ను సీజ్ చేశారు. వాల్టాచట్టానికి విరుద్ధంగా మహేంద్రతనయ నదిలో ఇసుకతవ్వకాలపై ‘సాక్షి’లో బుధవారం కథనం ప్రచురితమైంది. మరోవైపు వైఎస్సార్ సీపీ నాయకులు తడక జోగారావు, మంగిగణపతిలు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై ఆయన స్పందిస్తూ ఇసుక తవ్వకాలను పరిశీలించాలని ఆదేశించారు.
 
  ఈ మేరకు టెక్కలి ఆర్డివో ఎం.వెంకటేశ్వరరావు, తహాశీల్దార్ ఆర్.గోపాలరత్నంలు మహేంద్రతనయ నదిని పరిశీలించారు. నది సమీపంలో నిల్వ ఉంచిన ఇసుక పోగులను చూసి ఆశ్చర్యపోయారు. సుమారు 2,100 క్యూబిక్ మీటర్ల ఇసుక, పొక్లెయిన్‌ను సీజ్ చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. వారివెంట ఎంపీపీ చిత్రాడ శ్రీనివాసరావు, ఇరిగేషన్ ఏఈ హానుమంతు రెడ్డిలు ఉన్నారు.

 గుత్తేదారునికి కొమ్ముకాసిన అధికార పార్టీ నాయకులు
 నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను పోగువేశారని స్థానికులు చెబుతుండగా... టీడీపీ నాయకులు గుత్తేదారులకు కొమ్ముకాస్తూ మాట్లాడారు. దీనిని అధికారులు ఖండించారు. మహేంద్రతనయ నదిలో ఇసుకను సేకరిస్తే 250 గ్రామాల ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తుతుందన్నారు.

Advertisement
Advertisement