రా రమ్మని.. రా రా రమ్మని | Sakshi
Sakshi News home page

రా రమ్మని.. రా రా రమ్మని

Published Mon, Oct 21 2013 9:35 AM

రా రమ్మని.. రా రా రమ్మని - Sakshi

ఓరుగల్లుకు పెరిగిన పర్యాటకుల రాక
 ఈ ఏడు అరకోటి మంది సందర్శన
 ఏడాదిలో రెట్టింపు సంఖ్యలో తాకిడి

 
సాక్షి, హన్మకొండ : కాకతీయుల చారిత్రక వైభవం తెలుసుకోవడంతోపాటు ఇక్కడి ప్రకృతి అందాలను తిలకించే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి సైతం పర్యాటకులు వరంగల్‌కు వచ్చేందుకు ఆసక్తి చూపారు.  ఈఏడాది ఇప్పటికే అరకోటి మందికి పైగా పర్యాటకులు జిల్లాకు వచ్చారు. వీరిలో రికార్డు స్థాయిలో 608 మంది విదేశీ టూరిస్టులు ఉండడం విశేషం. మేడారం మహా జాతరను మినహాయిస్తే ఈ స్థాయిలో జిల్లాకు పర్యాటకులు రావడం ఇదే ప్రథమం.
 
కాకతీయ ఉత్సవాల ప్రభావం

 కాకతీయ రాజుల రాజధాని వరంగల్ . వారి పాలనకు గుర్తుగా ఖిలావరంగల్, వేయిస్తంభాల ఆలయాలతోపాటు కళ్లు చెదిరే శిల్పసంపదకు నెలవైన రామప్ప ఆలయం, గణపురం కోటగుళ్లు వంటి చారిత్రక ప్రాంతాలు జిల్లాలో ఉన్నాయి. అంతేకాదు... లక్నవరం, పాకాల, గణపసముద్రం, ఏటూరునాగారం అ భయారణ్యం వంటి ప్రకృతి అందాలు జిల్లా సొంతం. అన్నీ ఉన్నప్పటికీ సరైన ప్రచారం లభించక హైదరాబాద్‌తో పో ల్చితే జిల్లాకు వచ్చే పర్యాటకుల సంఖ్య గతంలో తక్కువగా ఉండేది. అయితే ఇక్కడి చారిత్రక ప్రాంతాలను వరల్డ్ హెరి టేజ్ సైట్స్‌గా గుర్తించాలనే లక్ష్యంతో రాష్ర్ట ప్రభుత్వం 2012 డిసెంబర్‌లో కాకతీయ ఉత్సవాలను ప్రారంభిం చింది.

ఈ నేపథ్యంలో మీడియా సైతం ఓరుగల్లులోని ప ర్యాటక ప్రాంతాల గురించి విస్తృతంగా ప్రచారం చేసింది. ఈ క్రమంలో 2012-13 ఏడాదికి గాను వరంగల్ నగరం బెస్ట్ హెరిటేజ్ సిటీగా కేంద్ర ప్రభుత్వ అవార్డును గెలుచుకుంది. వీటి ప్రభావంతో జిల్లాకు వచ్చే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2012లో జిల్లాకు వచ్చిన పర్యాట కుల సంఖ్య 23,00,000 ఉంది. జిల్లా పర్యాటక శాఖ ఆది వారం వెల్లడించిన గణాంకాల ప్రకారం 2013 జనవరి నుం చి సెప్టెంబర్ వరకు 51,92,266 మంది పర్యాటకులు జి ల్లాను సందర్శించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన పర్యాటకు లు 2,27,079 మంది, విదేశీ పర్యాటకులు 608 మంది ఉ న్నారు.  ఏడాది కాలంలోనే పర్యాటకుల సంఖ్య రెట్టిం పైం ది. ఈ తొమ్మిది నెలల కాలంలో మార్చిలో అత్యధికంగా 14,18,652 మంది పర్యాటకులు సందర్శించారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement