ఇక శవం తేలితేనే! | Sakshi
Sakshi News home page

ఇక శవం తేలితేనే!

Published Tue, Jan 13 2015 2:47 AM

ఇక శవం తేలితేనే! - Sakshi

ఫలించని గాలింపు చర్యలు
చెరువు వద్ద కుటుంబ సభ్యుల రోదన
రెండో రోజూ లభ్యంకాని మృతదేహం

 
పలమనేరు: పలమనేరు మండలం కరి డిమడుగు సమీపంలోని అటవీ ప్రాంత ంలో క్రిష్ణమనాయని చెరువులో విహా రానికెళ్లి నీట మునిగిన రియాజ్ అలి యాస్ అబ్బు (22) మృతదేహం సోమవారం సాయంత్రం వరకు కూడా కానరాలేదు. ఈ చెరువులో రెండ్రోజులుగా పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్లు గాలి స్తున్నా లాభం లేకపోయింది. శవం దా నంతట అదే తేలితే గానీ ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. ఆదివారం స్నేహితులతో కలసి చెరువులో ఈతకెళ్లి రియాజ్ నీట మునిగిన విషయం తెలిసిందే. అ ప్పటి నుంచి మృతదేహం కోసం గాలిం పు సాగుతూనే ఉంది. ఇప్పటికే చెరువు లో చాలా వరకు గాలింపు చేపట్టామ ని, ఇక  కొంత  భాగం మాత్రమే మిగిలి ఉం దని ఎస్‌ఐ రవినాయక్ తెలిపారు. రి యాజ్ కుటుంబ సభ్యులు చెరువు వద్దే కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. నేటి ఉదయం తిరిగి గాలింపు చేపట్టనున్నా రు.
 
మృతదేహం వెతుకుతూ మృత్యువాత..
 
రియాజ్ మృతదేహం కోసం గాలిస్తున్న గజ ఈతగాళ్లలో పలమనేరుకు చెందిన రెడ్డిప్రకాష్(52) ఉన్నారు. రెండు రో జు లుగా చలి ఎక్కువగా ఉండడం, నీళ్లలో మునుగుతూ ఉండడంతో ఊపిరి ఆడక ఆయన సోమవారం సాయంత్రం మృతి చెందాడు. రెడ్డిప్రకాష్ చేపలు పట్టుకుం టూ కుటుంబాన్ని పోషించేవాడు. ఆయన కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కు టుంబ పెద్ద మృతితో వారు దిక్కులేని వారయ్యారు. తమకు దిక్కెవరంటూ కు టుంబ సభ్యులు రోదించడం పలువురికి కలచివేసింది.
 

Advertisement
Advertisement