జలదిగ్బంధం | Sakshi
Sakshi News home page

జలదిగ్బంధం

Published Tue, Oct 14 2014 11:56 PM

జలదిగ్బంధం

బెల్లంకొండ: ‘పులిచింతల' ముంపు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నా యి. ఆ గ్రామాలను గత నెల 16న చుట్టుముట్టిన ‘కృష్ణమ్మ' మళ్లీ కన్నెర్ర చేసింది. రెండు రోజుల కిందట ప్రారంభమైన నీటి ప్రవాహం మంగళవారం మధ్యాహ్నానికి గణనీయంగా పెరిగింది. ప్రాజెక్టు పరిధిలో  గత నెల 11 టీఎంసీల నీటిని నిల్వ చేయగా, ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి చేరడంతో నిల్వ నీటి మట్టం 14 టీఎంసీలకు చేరింది. దీంతో అధికారులు ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేశారు.

తిరిగి రెండు రోజుల నుంచి నీటి ప్రవాహం పెరుగుతూ రావడంతో పులిచింతల ముంపు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గత నెల నుంచి గొల్లపేట-పులిచింతల రహదారి నీట మునిగి ఉండగా, మంగళవారం ఉదయం బోదనం వద్ద రహదారి నీట మునిగింది. ఫలితంగా పులిచింతల, గొల్లపేట, కోళ్లూరు, చిట్యాల, కేతవరం, చిట్యాలతండా, బోదనం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
 
  కోళ్లూరు, గొల్లపేట, బోదనం తదితర గ్రామాల్లో కొంతమంది నిర్వాసితులు అక్కడే ఉంటూ పంటలు సాగుచేస్తున్నారు. ప్రస్తుతం రాకపోకలు మూసుకుపోవడంతో నిర్వాసితులు గ్రామాల్లోనే ఉండిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ గ్రామాలకు బస్సు సర్వీసులు కూడా నిలిచిపోయాయి.
     మూడు రోజుల కిందట విద్యుత్ శాఖ అధికారులు వ్యవసాయ కనెక్షన్లు తొలగించారు. బస్సు సర్వీసులు కూడా నిలిచిపోవడంతో ముంపు గ్రామాల ప్రజలు వెంకటాయపాలెం అడవీ మార్గం గుండా కాలి నడకన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.
     కేతవరం, అగ్రహారం గ్రామాలకు ఉపాధ్యాయులు కూడా కాలినడకనే వెళుతున్నారు.
 విశాఖ వెళ్లిన మండల అధికారులు...
     ఉత్తరాంధ్రను హుదూద్ తుపాను ముంచెత్తిన నేపథ్యంలో అక్కడి సహాయ కార్యక్రమాల్లో పాల్గొనడానికి తహశీల్దార్ కేఎల్ ప్రసాద్ వారి బృందం, వివిధ శాఖల అధికారులు ఇక్కడి నుంచి వెళ్లారు. దీంతో నిర్వాసితులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
     గత నెలలో వరదలు వచ్చినపుడు హుటాహుటిన ఇక్కడికి చేరుకున్న అధికారులు సహాయ కార్యక్రమాలు చేపట్టారు. పడవలు ఏర్పాటు చేసి నిర్వాసితులను సురక్షిత ప్రాంతాలకు చేర్చారు.
 వసతులు కల్పిస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు...
       నీరు వచ్చి చేరుతున్నప్పటికీ గ్రామాలను ఖాళీ చేసి వెళ్లబోమని నిర్వాసితులు చెబుతున్నారు. తమకు రావాల్సిన ప్యాకేజీ ఇవ్వడంలో అధికారులు విఫలమయ్యారని, ప్యాకేజీ ఇవ్వకపోవడంతో పునరావాస కేంద్రాల్లో ఇళ్ల నిర్మాణాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయని వారు పేర్కొంటున్నారు.
     పునరావాస కేంద్రాల్లో కనీస వసతులు కల్పించలేదని, వసతులు కల్పించవుంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని వారు వాపోతున్నారు.
     ఇప్పటికైనా అధికారులు పునరావాస కేం ద్రాల్లో వసతులు కల్పి ంచాలని, తమకు రావాల్సిన ప్యాకేజీలను వెం టనే అందించాలని నిర్వాసితులు కోరుతున్నారు.

Advertisement
Advertisement