వయొలిన్‌ విద్వాంసుడు కొమండూరి కన్నుమూత | Sakshi
Sakshi News home page

వయొలిన్‌ విద్వాంసుడు కొమండూరి కన్నుమూత

Published Sun, Jul 23 2017 1:13 AM

Komanduri Krishnamacharya passes away

విశాఖ కల్చరల్‌: ప్రముఖ వయొలిన్‌ విద్వాంసుడు, స్థానిక ఆకాశవాణి పూర్వ నిలయ విద్వాంసుడు కొమండూరి కృష్ణమాచార్యులు కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఆయన తనయుడు శ్రీనివాసరావు గృహంలో శనివారం ఆయన తుదిశ్వాస విడిచారు. కొమండూరి 1936లో పశ్చిమ గోదావరి జిల్లా ఐ.భీమవరంలో జన్మించారు. ద్వారం నరసింహనాయుడు వద్ద శిష్యరికం చేసి వయొలిన్‌లో ప్రావీణ్యం సంపాదించారు. విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో క్యాజువల్‌ ఆర్టిస్టుగా కొంతకాలం పనిచేసిన ఆయన 1974లో విశాఖపట్నం ఆకాశవాణి కేంద్రంలో నిలయ విద్వాంసుడిగా చేరి 1994 వరకు ఇక్కడే పనిచేశారు. 2015లో ఆయన భార్య వీర రాఘవమ్మ కన్నుమూశారు. కృష్ణ మాచార్యులు మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు.

Advertisement
Advertisement