భలే మర్చిపోయారు బాబూ.. | Sakshi
Sakshi News home page

భలే మర్చిపోయారు బాబూ..

Published Thu, Jan 15 2015 2:21 AM

భలే మర్చిపోయారు బాబూ.. - Sakshi

తిరుపతితుడా: ముఖ్యమంత్రి నారా చం ద్రబాబునాయుడు సొంత గ్రామంలో ప్రభుత్వ, ఫారెస్ట్, కాలువ పోరంబోకు భూములతో పాటు నారావారిపల్లి శ్మశానాన్ని అదే గ్రామానికి చెందిన మాజీ మంత్రి గల్లా అరుణకుమారి అనుచరు డు కబ్జాకు పాల్పడ్డాడు. రెండేళ్ల కిందట సంక్రాంతి పండుగకు నారావారిపల్లెకు వచ్చిన బాబుకు స్థానికులు భూకబ్జాపై ఫిర్యాదు చేశారు. స్పందించిన చంద్రబాబు అక్కడే ఉన్న తహశీల్దార్ మనోహర్‌ను పిలిచి కబ్జా చేస్తుంటే ఏం చేస్తున్నా వ్.. ఉద్యోగం చేయాలని ఉందా లేదా.. ఆక్రమణలను అడ్డుకోకుంటే జైలుకు పం పిస్తానంటూ హెచ్చరించారు. అప్పుడు ఆక్రమణకు పాల్పడ్డ వ్యక్తే నేడు సం క్రాంతికి వస్తున్న చంద్రబాబుకు సుస్వాగతం అంటూ పెద్ద ఎత్తున ఫ్లెక్లీలు ఏర్పాటు చేశాడు.

పట్టించుకోని అధికారులు ..

ఆక్రమణదారుడు బాబు సొంత ఇంటికి ఆనుకుని తూర్పు వీధిలో నివాసముం టున్నాడు. గతంలో మాజీ మంత్రి గల్లా అరుణకుమారి అండతో నారావారిపల్లె శ్మశానం, దళితుల భూములను ఆక్రమించినా అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. సర్పంచ్, గ్రామస్తులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం దక్కలేదు. గతంలో చంద్రబాబే రంగంలోకి దిగి ఆక్రమణలను తొలగిం చాలని హెచ్చరించినా గల్లా అరుణకుమారి అండ ఉండటంతో ఎవరూ అడ్డుకునే సాహసం చేయలేకపోయారు. ఇప్పటికైనా నారావారిపల్లెలో ఆక్రమణకు గురైన భూములను స్వాధీనం చేసుకునేందుకు అధికారులు సాహసం చేస్తారో లేదో వేచి చూడాల్సి ఉంది. గత నెలలో టీటీడీ పాత నేతలు భూ ఆక్రమణలను తొలగించాలని చంద్రగిరి తహశీల్దార్ కిరణ్‌కుమార్‌ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఇంత జరుగుతున్నా బాబు మాత్రం పట్టించుకోలేదని కొంత మంది నేతలు వాపోతున్నారు.
 
ఆధారాలు ఇవీ..


నారావారిపల్లె శ్మశాన వాటిక సర్వే నం బర్ 174లో ఉంది. ఈ శ్మశానంలో 31 సెంట్ల భూమి ఆక్రమణకు గురైంది. గ్రామానికి ఉత్తరం, పడమర, శివాలయం ప్రాంతాల్లో దాదాపు 100 ఎకరా ల ప్రభుత్వ, డీకేటీ, ఫారెస్ట్, కాలువ పొరంబోకు భూములను ఆక్రమించారు. అటవీ ప్రాంతంలో కొండను తవ్వి చదును చేశారు. 30 అడుగుల ఎత్తు కొండను తవ్వి ఆక్రమించారు. గ్రామానికి భవిష్యత్‌లో ఎలాంటి అవసరాలకు కాస్త భూమి లేకుండా కబ్జా చేశారు.

భూములను స్వాధీనం చేసుకుంటాం..

కందులవారిపల్లె, శేషాపురం, నారావారిపల్లెలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను గుర్తించాం. శేషాపురం శ్మశానం వాటిక 1.10 ఎకరాల స్థలాన్ని కబ్జా చేశారు. శ్మశాన  భూమిని సర్వే చేయించాం. ఇందుకు సంబంధంచిన ఫైల్‌ను సిద్ధం చేశాం. త్వరలో ఆక్రమణ భూములను స్వాధీనం చేసుకునేందుకు చర్యలు తీసుకుంటాం.
 - కిరణ్‌కుమార్, తహశీల్దార్, చంద్రగిరి
 
 

Advertisement
Advertisement