మత్తులో చిత్తవుతున్న కొండాపూర్ | Sakshi
Sakshi News home page

మత్తులో చిత్తవుతున్న కొండాపూర్

Published Mon, Jan 13 2014 4:19 AM

life passes away  Due to the alcohol drinking

 ముస్తాబాద్, న్యూస్‌లైన్ : మత్తు విచక్షణను చంపుతుంది.. క్షణికావేశాలకు పూరి గొల్పుతుంది.. ఫలితం భార్య, బిడ్డలనే కాదు.. జన్మనిచ్చిన తల్లిదండ్రులపై దాడులు. అంతేకాదు చేతి చమురును కో ల్పోయేలా చేస్తుంది. చివరకు ప్రాణాలను హరిస్తుంది. కొద్ది నెలల్లోనే మండల కేంద్రంలోని కొండాపూర్‌లో అతిగా మద్యం తాగి నలుగురికి పైగా మృత్యువాతపడ్డారు. తాజా గా ఓ యువకుడు మత్తుకు అలవాటుపడి వింతగా ప్రవర్తించసాగాడు. కుటుంబసభ్యులు అతడిని హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చేర్పించారు. మద్యంతోపాటు బ్రౌన్‌షుగర్ వాడుతున్నట్టు వైద్యు లు నిర్ధారించారు. మారుమూల పల్లెలోకి నిషేధిత మత్తుపదార్థమైన బ్రౌన్‌షుగర్ ఎలా వచ్చిందన్న విషయం ప్రస్తుతం అందరినీ తొలుస్తోంది.
 
 ముస్తాబాద్ మండలం కొండాపూర్‌లో కొద్ది సంవత్సరాలుగా విచ్చలవిడిగా మద్యం అమ్మకాలతో అనేక కుటుంబా లు వీధిన పడుతున్నాయి. తాగి దాడి చేశాడంటూ ముస్తాబాద్ పోలీస్‌స్టేషన్‌లో కన్న కొడుకు, భర్తపై కేసులు నమోద యిన ఘటనలు పెరిగిపోతున్నాయి. గుడుంబా, బెల్ట్‌దుకాణాల్లో లభిస్తున్న చౌక మద్యం గ్రామం పాలిటశాపంగా మారింది. ఇదంతా ఒక ఎత్తై.. తాజాగా ఓ వ్యక్తి తాగుడుకు బానిసై, కుటుంబాన్ని పట్టించుకోవడం లేదని భావించిన కుటుంబసభ్యులు వారం పాటు అతడికి మద్యం అందుబాటులో లేకుండా చేశారు. దీంతో అతడు మత్తుకోసం పిచ్చివాడిగా మారి, గోడలు, నేలపై పడి మట్టిని తింటున్నాడు.
 
 సద రు వ్యక్తి విపరీతంగా ప్రవర్తించడంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు హైదరాబాద్‌కు తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. అక్కడ వైద్యులు సదరు వ్యక్తిని పరీ క్షించగా మద్యం, గుడుంబాతోపాటు బ్రౌన్‌షుగర్ నిత్యం వాడడం వల్లె తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడని తేల్చిచెప్పారు. కొద్ది రోజులుగా బ్రౌన్‌షుగర్ వాడుతున్నాడని వైద్యు లు చెప్పడంతో వారు తీవ్ర అందోళనకు గురువుతున్నారు. మామూలు పల్లెటూరిలో బ్రౌన్‌షుగర్ ఎక్కడి నుంచి వస్తోం దని గ్రామస్తులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఓ వ్యక్తి తాను ఆఫీసర్‌నంటూ ప్రభుత్వ పాఠశాలను సైతం తనిఖీ చేసి హల్‌చల్ సృష్టించాడు.
 
 ఇది కూడా మత్తు విపరీతానికి పరాకాష్టగా భావిస్తున్నామని ఎస్సై బాబురావు పేర్కొన్నారు. కొండాపూర్ సమీపంలోని రాంరెడ్డిపల్లి నుంచి పెద్ద ఎత్తున గుడుంబా ఇక్కడికి సరఫరా అవుతోంది. ఇప్పటికే కేసులు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు. బ్రౌన్‌షుగర్ వాడడం వల్లే హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న వ్యక్తి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడని, గ్రామంలో మద్యం, గుడుంబా విక్రయాలను నిలిపివేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామస్తులను రక్షించాల్సిన అవసరం అధికారులపై ఉంది.
 

Advertisement
Advertisement