వివాహిత ఆత్మహత్యాయత్నం | Sakshi
Sakshi News home page

వివాహిత ఆత్మహత్యాయత్నం

Published Fri, Sep 25 2015 10:59 PM

married lady suicide attempt in vijayanagaram

పార్వతీపురం టౌన్(విజయనగరం): ఓ వివాహిత బలవన్మరణానికి యత్నించింది. ఈ ఘటన విజయనగరం మండలం పార్వతీపురంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. జిల్లాలోని సీతానగరం మండలం చెల్లాయి వలస గ్రామానికి చెందిన చంద్రకళకు నాలుగు నెలల కిందట వివాహమైంది. అయితే ఆమె భర్తతో కలసి విశాఖపట్టణంలో నివాసముంటుంది. కానీ ఈ రోజు ఒంటరిగా ఇంటికి వస్తూ మార్గంమధ్యంలో పురుగులు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు బాధితులు వారిని ఆస్పత్రికి తరలించారు.

Advertisement
Advertisement