Sakshi News home page

పుష్కరాలకు మరిన్ని స్పెషల్ రైళ్లు

Published Sat, Jul 18 2015 12:09 AM

పుష్కరాలకు మరిన్ని స్పెషల్ రైళ్లు

విశాఖపట్నం సిటీ : గోదావరి పుష్కరాల కోసం మరిన్ని ప్రత్యేక రైళ్లను వాల్తేరు రైల్వే ప్రకటించింది. ఈ రైళ్లు ఈనెల 18, 19, 20, 24 తేదీల్లో నడుస్తాయని స్పష్టం చేసింది. విశాఖపట్నం-నిడదవోలు మధ్య ఈ రైళ్లు పరుగెడతాయని వెల్లడించింది. విశాఖపట్నం-నిడదవోలు ప్రత్యేక రైలు(01839) ఈనెల 18, 19 తే దీల్లో ఉదయం 9.45 గంటలకు బయల్దేరి  రాజమండ్రికి మధ్యాహ్నం 2.47 గంటలకు, నిడదవోలుకు సాయంత్రం 3.25 గంటలకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో సాయంత్రం 4.30 గంటలకు నిడద వోలులో బయల్దేరి రాజమండ్రికి సాయంత్రం 5.30 గంటలకు, రాత్రి 10.30 గంటలకు విశాఖకు చేరుతుంది. ఈ రైలు దువ్వాడ, అనకాపల్లి, నర్సింగపల్లి, ఎలమంచిలి, నర్సీపట్నం రోడ్, తుని, అన్నవరం, పిఠాపురం, సామర్లకోట, అనపర్తి, ద్వారపూడి, కడియం, రాజమండ్రి, గోదావరి, కొవ్వూరు స్టేషన్‌లలో ఆగుతుంది. మొత్తం 12 జనరల్ బోగీలుంటాయి.

విశాఖపట్నం-నిడదవోలు ప్రత్యేక రైలు(01835) ఈనెల 20, 24 తేదీల్లో ఉదయం 5.30 గంటలకు విశాఖలో బయల్దేరి రాజమండ్రికి ఉదయం 9.30 గంటలకు, నిడదవోలుకు 10.15 గంటలకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఉదయం 10.45 గంటలకు బయల్దేరి రాజమండ్రికి ఉదయం 11.55 గంటలకు, విశాఖకు సాయంత్రం 4.30 గంటలకు చేరుతుంది. ఈ రైలు తొమ్మిది జనరల్ బోగీలు, 10 జనరల్ ఛైర్‌కార్ బోగీలుంటాయి. పైన తెలిపిన అన్ని స్టేషన్‌లలో ఈ రైలు ఆగుతుందని వాల్తేరు రైల్వే సీనియర్ డివిజనల్ కమర్షియల్‌మేనేజర్ ఎం. ఎల్వేందర్ యాదవ్ తెలిపారు.
 

Advertisement

What’s your opinion

Advertisement