తమ్ముళ్ల తన్నులాట | Sakshi
Sakshi News home page

తమ్ముళ్ల తన్నులాట

Published Mon, May 9 2016 2:37 AM

తమ్ముళ్ల తన్నులాట - Sakshi

హైదరాబాద్‌కు చేరనున్న నీరు-చెట్టు పంచాయితీ

నీరు చెట్టు పనుల కేటాయింపుపై తెలుగు తమ్ముళ్ల మధ్య గొడవలు చెలరేగాయి. చిలికిచిలికి గాలివానగా మారింది. తమ వారిపైనే అట్రాసిటీ కేసులు నమోదు చేసే స్థాయికి దిగజారింది. పనుల వివరాలపై ప్రశ్నించిన ఓ నాయకుడుపై కేసులు పెట్టటంతో పంచాయితీని హైదరాబాద్‌కు చేర్చారు. పనులు ఏ మండలానికి ఆ మండలానికే కేటాయించాలని స్థానిక నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు తమ్ముళ్ల మధ్య చెలరేగిన గొడవలు అందర్ని ముక్కున వేలేసుకుసేలా చేస్తున్నాయి..-  గుడివాడ

 గుడివాడ: నీరు-చెట్టు తెలుగు తమ్ముళ్లకు వరంగా మారింది. పనులు చేజిక్కించుకునేందుకు నానా తం టాలు పడుతున్నారు. నియోజకవర్గంలో రూ.కోట్ల పనులు కొందరికి దక్కకపోవడంతో పార్టీ నేతల మధ్య చిచ్చు రేపుతుంది. పనులు పరిశీలిస్తున్న నాయకుడుపై అట్రాసిటీ కేసులు పెట్టే పరిస్థితి నెల కొంది. జిల్లాలోని పలు ప్రాంతాల నేతలు నియోజకవర్గంలో పనులు చేజిక్కించుకున్నారు. స్థానిక నేతలకు మింగుడు పడటం లేదు. నేతల మధ్య రగడ కొనసాగుతుంది.

 పప్పు, బెల్లాల్లా పంచారు..

గతంలో చంద్రయ్య డ్రెయిన్ ఆధునికీకరణ పనుల్లో ఉంది. దీనిని నీరు-చెట్టులోకి తీసుకొచ్చి పనులను తమ్ముళ్లకు పప్పుబెల్లాల్లా పంచారు. ఉయ్యూరు కేసీపీ ఫ్యాక్టరీ వద్ద డ్రెయిన్ మొదలై ఉప్పుటేరు వద్ద కలుస్తుంది. గుడివాడ చానల్‌లో పనులు నీరు-చెట్టు కింద పెట్టి మట్టిని అమ్ముకునేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ విషయంలోనూ తమ్ముళ్ల మధ్య గొడవలు రేగుతున్నాయి.

 సొంత వారే పగయ్యారు..

 నందివాడ మండలానికి చెందిన కాకరాల సురేష్ నీరు-చెట్టు పనులు పరిశీలించేందుకు వెళ్లారు. ఆయనపై సొంత పార్టీ వారే ఎస్సీ, ఎస్టీ  అట్రాసిటీ కేసు నమోదు చేయించారు. దీనిపై పార్టీ అధినేత చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లేందుకు రంగం సిద్ధం చేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement