ఆపరేషన్ నీటి తీరువా | Sakshi
Sakshi News home page

ఆపరేషన్ నీటి తీరువా

Published Sun, Jul 13 2014 12:28 AM

ఆపరేషన్ నీటి తీరువా - Sakshi

సాక్షి, గుంటూరు: నీటి తీరువా బకారుులను ముక్కుపిండి మరీ వసూలు చేయూలని ప్రభుత్వం నిర్ణరుుంచింది. ఈ మేరకు రెవెన్యూ యంత్రాగంపై తీవ్ర స్థారుులో ఒత్తిడి తెస్తోంది. దీంతో అధికారులు జిల్లాలో రూ.31.38 కోట్ల మేర ఉన్న బకాయిలను ఈ నెలాఖరులోగా వసూలు చేయాలని నిర్ణయించారు.
 
 ఇందులో భాగంగా జాయింట్ కలెక్టర్ ఎస్.వివేక్ యాదవ్ తహశీల్దార్లు, రెవెన్యూ డివిజనల్ అధికారులతో ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నీటి తీరువా బకారుుల వసూలుకు వీఆర్వోలకు రోజువారీ లక్ష్యాలను నిర్ణయించి.. ఆ మేరకు కచ్చితంగా వసూలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బకాయిలు ఎక్కువగా ఉన్న మండల తహశీల్దార్లను ప్రత్యేకంగా హెచ్చరించారు. వసూళ్లలో జాప్యం జరిగితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌లో వివరాలు సరిగా చెప్పలేకపోరుున తహశీల్దార్లకు మెమోలు జారీ చేయూలని ఆర్‌డీవోలకు సూచించారు.
 
 అన్నదాతల్లో అందోళన...
 నీటి తీరువా బకారుులు వెంటనే చెల్లించాలని రెవెన్యూ అధికారులు ఒత్తిడి తెస్తుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వరుసగా వచ్చిన అతివృష్టి, అనావృష్టి కారణంగా పూర్తిగా చితికిపోయూమని, ఈ స్థితిలో ఉన్నపళంగా బకారుులు చెల్లించమంటే ఎలాగని వాపోతున్నారు. ఖరీఫ్ పంటలకు బ్యాంకు రుణాలు అందకపోవడంతోపాటు విత్తనాలు, ఎరువులు సమకూర్చుకొనేందుకు అష్టకష్టాలు పడుతున్న ఈ సమయంలో నీటి తీరువా చెల్లించటం ఎలా సాధ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
 ఇది గోరుచుట్టు మీద రోకటి పోటులా ఉందంటున్నారు. మరోవైపు.. ప్రభుత్వ వైఖరితో రెవెన్యూ అధికారులూ ఆందోళన చెందుతున్నారు. పీకలోతు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అన్నదాతల నుంచి బకారుులు వసూలు చేయటం కష్టమని, అలాగని ఊరుకుంటే ఉన్నతాధికారుల చర్యలకు బలికావాల్సి వస్తుందని వాపోతున్నారు. తమ పరిస్థితి.. ముందు నురుు్య, వెనుక గొరుు్యలా ఉందని గగ్గోలు పెడుతున్నారు.
 
 ఇదీ పరిస్థితి
 నరసరావుపేట డివిజన్‌లో బకారుుల వసూలు అతితక్కువగా ఉంది. డివిజన్‌లోని బకారుుల మొత్తంలో ఇప్పటివరకు కేవలం 19.40 శాతం మాత్రమే వసూలైంది.
 
 గురజాల డివిజన్‌లో అత్యధికంగా 53.52 శాతం మొత్తం వసూలైంది.
 
 తెనాలి రెవెన్యూ డివిజన్‌లోని పొన్నూరు, నగరం, కర్లపాలెం, వేమూరు.. నరసరావుపేట డివిజన్‌లోని రొంపిచర్ల, శావల్యాపురం, గుంటూరు డివిజన్‌లోని ముప్పాళ్ల మండలాల్లో బకారుుల మొత్తం రూ.కోటికిపైగా ఉంది. దీంతో ఈ మండలాలపై రెవెన్యూ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు.
 

Advertisement
Advertisement