కుమారుడిని వదిలించుకున్నతల్లిదండ్రులు 

14 Sep, 2019 10:55 IST|Sakshi
సురుటపల్లిలో తల్లిదండ్రుల కోసం ఎదురు చూస్తున్న బాలుడు ఏసు

సాక్షి, చిత్తూరు : నాగలాపురం మండలం సురుటపల్లిలోని శ్రీ పళ్లికొండేశ్వరాలయం వద్ద కుమారుడిని వదలి తల్లిదండ్రులు అదృశ్యమైన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. బిక్కుబిక్కుమంటూ దిగాలుగా ఉన్న ఆ బాలుడిని భక్తులు, ఆలయ అధికారులు గమనించి చేరదీశారు. బుజ్జగించి అతడి వివరాలు తెలుసుకున్నారు. తన పేరు ఏసు అని, తనది ఏలూరు అని, తన తండ్రి పేరు సుబ్బారావు, తల్లిపేరు పుష్ప అని తెలిపాడు. తన తల్లిదండ్రులు బాతులు మేపుకుంటూ ఈ ప్రాంతానికి వచ్చారని, రాత్రి నుంచి కనిపించకుండా పోయారని ఏడుస్తూ చెప్పాడు. ఆలయ అధికారులు ఆ బాలుడిని నాగలాపురం పోలీసులకు అప్పగించారు. స్పందించిన పోలీసులు అతను చెప్పిన వివరాలను ఏలూరు పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం చేరవేసి తల్లిదండ్రుల వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. బాలుడిని తాత్కాలికంగా సురుటపల్లి చిన్న పిల్లల హోమ్‌కు తరలించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తిరుపతిలోని చిన్న పిల్లల హోమ్‌కు శనివారం తరలిస్తామని ఆలయ అధికారులు తెలిపారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

హామీలు నెరవేర్చిన ఘనత జగన్‌దే

మహిళా దొంగలున్నారు.. జర జాగ్రత్త

తిరుపతిలో రిజిస్ట్రేషన్ల కుంభకోణం?

చేయి తడపనిదే..

వాణిజ్యశాఖ స్టాండింగ్‌ కమిటీ ఛైర్మన్‌గా విజయసాయిరెడ్డి

నిర్లక్ష్యాన్ని సహించబోం

మీ అంతు తేలుస్తా!

మెడికల్‌ కళాశాల క్వార్టర్స్‌లో టీడీపీ నేతలు

బాబూ.. గుడ్‌బై..

మింగేసిన బావి

స్నేహాన్ని విడదీసిన మృత్యువు

తీరంలో హై అలెర్ట్‌

మన‘సారా’ మానేశారు

కరణం బలరామ్‌కు హైకోర్టు నోటీసులు

ఇక స్కూల్‌ కమిటీలకు ఎన్నికలు...

సాగునీటి సంకల్పం

అందుకే పల్నాడు ప్రజలు ఆనందంగా ఉన్నారు

అన్నయ్యా.. నా పిల్లలను బాగా చూసుకో...

మిఠాయిలో పురుగుల మందు కలుపుకుని..

తెల్లారిన బతుకులు

అదరహో..అరకు కాఫీ

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి

అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు

కుటుంబరావు భూ కబ్జా ఆటకట్టు

పెరిగిన వరద

ప్రాణాలు తీసిన నిద్రమత్తు

టీడీపీ నేతల గ్రానైట్‌ దందా

పలువురు ఐఏఎస్‌ అధికారుల బదిలీ 

అవినీతి నిర్మూలనకే రివర్స్‌ టెండరింగ్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కామెడీ ఎంటర్‌టైనర్‌తో టాలీవుడ్‌ ఎంట్రీ

అక్షయ్‌ కుమార్‌ కెరీర్‌లోనే తొలిసారి!

నయన పెళ్లెప్పుడు?

వదంతులకు పుల్‌స్టాప్‌ పెట్టండి

బందోబస్త్‌ సంతృప్తి ఇచ్చింది

సరికొత్త యాక్షన్‌