ప్రమాదమని తెలిసినా..! | Sakshi
Sakshi News home page

ప్రమాదమని తెలిసినా..!

Published Sun, Jun 1 2014 12:25 PM

ప్రమాదమని తెలిసినా..! - Sakshi

సీతాఫల్‌మండి: తొందరగా గమ్యం చేరాలనే తపనతో ప్రాణాలను కూడా లెక్కచేయడంలేదు కొంతమంది ప్రయాణికులు. సెల్ ఫోన్ మాట్లాడుతూ..ఇయర్ ఫోన్‌లో పాటలు వింటూ ...రైలు పట్టాలను దాటడం వీరికి ఫ్యాషనైంది. ఆనక తమ నిర్లక్ష్యానికి మూల్యం చెల్లించుకోక తప్పడంలేదు. పట్టాలు దాటుతూ మృతి చెందుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోవడం చూస్తునే ఉన్నాం. తరచుగా ఇలాంటి వి జరుగుతున్నా ప్రజల్లో మార్పు రావడంలేదు. దీనికి తోడు రైల్వే పోలీసుల నిర్లక్ష్యం.  ఫుట్ బోర్డు బ్రిడ్జిలను ఉపయోగించుకోవాలనే విషయాన్ని  ప్రయాణికులకు అవగాహన కలిగించలేకపోతున్నారు. దీంతో పట్టాలు దాటేవారి ప్రాణాలు గాలిలో క లిసి పోతున్నాయి. రైల్వే అధికారులు వివిధ రైల్వే స్టేషన్లలో ఫుట్‌బోర్డు బ్రిడ్జిలను నిర్మించినప్పటి కీ వాటి ఉపయోగం అంతంతా మాత్రంగానే ఉంది.

 

తక్కువ సమయంలో పట్టాలు దాటి అవతలికి వెళ్లిపోవచ్చనే ఆతృతతో ప్రమాదాలను సైతం లెక్క చేయడంలేదు. దీనికి తోడు పట్టాలు దాటుతున్న సమయంలో సెల్‌ఫోన్‌లో మాట్లాడడం తో వెనుక  నుంచి వచ్చే రైలును గమనించక పోవడం తో క్షణకాలంలో ప్రాణాలు కోల్పోతున్నాయి. ము ఖ్యంగా జామైఉస్మానియా, సీతాఫల్‌మండి, ఆర్ట్స్ కా లేజ్ రైల్వే స్టేషన్లలో నిత్యం జరుగుతున్న తంతు ఇది.  
 
 ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి
 
 రైలు పట్టాల వెంబడి స్థానికులు నివాసం ఉంటుండటం కూడా ఈ ప్రమాదాలకు కార ణంగా మారుతున్నాయి. రైల్వే స్టేషన్ల సమీపంలో నివాసం ఉంటున్న  వారు రైల్వే పట్టాలపై రాకుండా ఫెన్సింగ్ వేస్తే ప్రమాదాలు చాలా వరకు నివారించవచ్చని ప్రజలు అంటున్నారు. గతంలో ఈ రైల్వే స్టేషన్లలో పట్టాలు దాటుతున్న మృతి చెందిన వారు అనేకమంది ఉన్నారు. ఇప్పటికైనా రైల్వే పోలీసులు ఫుట్ బోర్డు బ్రిడ్జిలను ఉపయోగించుకునేలా ప్రజలకు  అవగాహన కల్పించాలని పలువురు కోరుతున్నారు.

Advertisement
Advertisement