ప్రభుత్వం ఆదుకోలేదు | Sakshi
Sakshi News home page

ప్రభుత్వం ఆదుకోలేదు

Published Sun, Jan 6 2019 9:16 AM

People Request To YS Jagan - Sakshi

తిత్లీ తుపాను సమయంలో మా ఇళ్లు కూలిపోయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇళ్లు మంజూరు చేయాలని అధికారులు చుట్టూ తిరిగినా పట్టిం చుకోలేదు. చెట్టు కింద జీవనం సాగిస్తున్నాం.
– సమేన ధనలక్ష్మి, కొర్లాం, సోంపేట మండలం

సంక్షేమ పథకాలు అందించాలి
మీరు సీఎం అయిన తర్వాత ప్రజా సంక్షేమ పథకాలు అమలుకు శ్రీకారం చుట్టాలి. అం దుకు అవసరమై ప్రాజెక్టులను డిజైన్‌ చేస్తున్నాం. గ్రామీణ ప్రాం తాల్లో వివిధ కులాల వారు చేపడుతున్న కుల వృత్తులకు శిక్షణతోపాటు, మహిళలకు వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తే మన పార్టీకి మంచి భవిష్యత్‌ ఉంటుంది.
– కళ్లేపల్లి అనసూయదేవి, శ్రీకాకుళం.

ఆరోగ్య శ్రీ ఆదుకోవడం లేదన్నా
ఆరోగ్య శ్రీ పథకం నిరుపేద రోగులను ఆదుకోవడం లేదు. నా బిడ్డ పాతిని శైలజ ఏడాది నుంచి బ్లడ్‌ క్యాన్సర్‌తో బాధపడుతోంది. నిరుపేద కుటుంబానికి చెందిన వాళ్లం. మా వద్ద ఉన్న డబ్బులన్నీ ఖర్చు చేశాం. నా బిడ్డ ఆరోగ్యం మెరుగుపడలేదు. ఆరోగ్య శ్రీ పథకం ద్వారా వైద్యం అందించమని ఆస్పత్రుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదు. నా బిడ్డకు ఆపరేషన్‌ చేయించి ప్రాణభిక్ష పెట్టండి.
– చిన్నారి శైలజతోపాటు తల్లి దానమ్మ, మావుడుపల్లి, సోంపేట మండలం.

ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి లేక రోడ్డు ప్రమాదాలు
బారువా రైల్వే గేటు వద్ద ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి లేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. మా గ్రామం నుంచి విద్యార్థులు, కూలీ లు, ఉద్యోగులు నిత్యం బారువ వైపు వెళ్తుటారు. రైల్వే గేటు దాటుతుండగా ప్రమాదాలు జరిగి ఎక్కువగా విద్యార్థులు మరణిస్తున్నారు.
– సత్యంబాది సాహు,బి.కొర్లాం, సోంపేట మండలం

నా బిడ్డను ఆదుకోండి
నా బిడ్డ పూజ ఆరేళ్ల నుంచి బ్రెయిన్‌ సం బంధిత వ్యాధితో బాధపడుతోంది. శ్రీకా కుళం, విశాఖపట్నంలోని ప్రధాన ఆస్పత్రులకు తీసుకువెళ్లినా ఫలితం లేదు. నా బిడ్డ చికిత్స కోసం సాయం చేయాలి.
– చిన్నారి పూజతో తల్లిదండ్రులు, టి.శాసనం, సోంపేట మండలం.

గుండె ఆపరేషన్‌ చేయించండి
గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాను. కూలి చేసుకొని తెచ్చిన వేలాది రూపాయలు ఖర్చు చేశాను. చివరికి గుండె సంబంధిత వ్యాధి ఉందని, ఆపరేషన్‌ చేయాలని వైద్యులు చెబుతున్నారు. ఆరో గ్య శ్రీ పథకం వర్తించదని చెబుతున్నారు. ఆదుకోవాలన్నా.
– దున్న శౌషమ్మ, పాలవలస కాలనీ,సోంపేట మండలం

జగన్‌తోనే సుపరిపాలన
రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితోనే సుపరి పాలన సాధ్యం అవుతుంది. జగనన్న పాలన కోసం జనమంతా ఎదురు చూస్తున్నారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పాలన ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. మళ్లీ ఆ పాలన జగన్‌తోనే సాధ్యం.
– సింహాచలం, పాలవలస, సోంపేట మండలం

రేషన్‌ కార్డు ఇవ్వడం లేదు
నేను పోస్టల్‌ శాఖలో కాంట్రాక్టు పద్ధతిన ఉద్యోగం చేస్తున్నాను. వచ్చే జీతం కుటుంబ జీవనానికి కూడా సరిపోవడం లేదు. రేషన్‌కార్డు మంజూరుకు దరఖాస్తు చేస్తే మేము వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరులమని దరఖాస్తును తిరస్కరిస్తున్నారు. న్యాయం చేయండి.
– ఎం.నాగమణి, కొర్లాం, సోంపేట మండలం.

ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలి
ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలి. డీజిల్, పెట్రోల్‌ రేట్లు భారీగా పెరిగిపోయాయి. పరిమితికి మించి టిక్కెట్లు ఎక్కిస్తే పోలీసులు కేసులు బనాయిస్తున్నారు. ట్యాక్స్‌ల పేరుతో ఇబ్బంది పడుతున్నాం. మా కుటుంబాలను పోషించుకోలేకపోతున్నాం. ఆదుకోవాలి.
– ఆటో యూనియన్‌ నాయకులు, మాకన్నపురం, సోంపేట మండలం

సాయం చేయలేదు
తిత్లీ తుఫాన్‌ సాయం ఇప్పటికీ అందజేయలేదు. నాకున్న ఒకటిన్నర ఎకరాల కొబ్బరి తోట పూర్తిగా పాడైపోయింది. అధికారులు చుట్టూ ప్రదక్షిణలు చేసినప్పటికీ ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం అందజేయలేదు. అధికారులు కనీసం స్పందించడం లేదు.
– కె.లక్ష్మమ్మ, తాలభద్ర, సోంపేట మండలం

పింఛన్‌ తొలగించారు
నా కంటికి సమస్య వచ్చి ఆపరేషన్‌ చేయించుకున్నాను. దీని కోసం నా కుమార్తె వద్దకు హైదరాబాద్‌ వెళ్లాను. ఆరు నెలలు ఉండి వచ్చాను. ఇక్కడకు వచ్చాక నా పింఛన్‌ తొలగించారు. ఏడాదిన్నరగా పింఛన్‌ ఇవ్వడం లేదు. మాలాంటి వారిని ప్రభుత్వం ఆదుకోవడం లేదు.
– కర్రి ఎండమ్మ, పాలవలస, సోంపేట

Advertisement
Advertisement