నా ప్రాణం వైఎస్సార్‌ భిక్ష | Sakshi
Sakshi News home page

నా ప్రాణం వైఎస్సార్‌ భిక్ష

Published Wed, Feb 28 2018 6:32 AM

People sharing their sorrows to ys jagan - Sakshi

ఒంగోలు వన్‌టౌన్‌:‘రాజన్న పెట్టిన ప్రాణభిక్షే ఈ రోజు నన్ను నీ వద్దకు తీసుకొచ్చింది. ఆరోగ్యశ్రీ పథకం కింద 2009లో వైఎస్సార్‌ చేయించిన గుండె ఆపరేషన్‌తోనే నేను బతికాను’ అంటూ దర్శి మండలం తొర్లమడుగు గ్రామానికి చెందిన గుర్రపుశాల రమణమ్మ సంకల్పయాత్రలో జననేతను కలసి తన అభిమానాన్ని చాటుకుంది. కొద్ది దూరం నడిచి యాత్ర విజయవంతం కావాలని జననేతను ఆశీర్వదించింది.

పదేళ్లుగా పోరాడుతున్నాం
 ‘2007లో వైఎస్సార్‌ హయాంలో నియామకమైన ఆర్‌సీహెచ్‌–2 ఏఎన్‌ఎంలను రెగ్యులరైజ్‌ చేయాలని పదేళ్లుగా పోరాడుతున్నా న్యాయం జరగడం లేదు. ఇప్పటి వరకు కాంట్రాక్టు పద్ధతిలో తీసుకున్నారా.. అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో తీసుకున్నారా అని కూడా చెప్పలేకపోతున్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తమకు న్యాయం చేయాలి’ అంటూ ఉప్పలపాడు సమీపంలో ఆర్‌సీహెచ్‌–2 ఏఎన్‌ఎంలు కె.విజయ, సారా, మల్లీశ్వరీ, ఎన్‌.రాణి, జ్యోతి, నాగరత్నం తదితరులు జననేతను కలసి వినతి పత్రం అందించారు.
 

Advertisement
Advertisement