చిన్నాపెద్దా అందరికీ కిడ్నీ వ్యాధులే! | Sakshi
Sakshi News home page

వైఎస్సార్, జగన్‌ ఫొటో పెట్టామని..

Published Thu, Mar 1 2018 6:41 AM

People sharing their sorrows to ys jagan  - Sakshi

ఉలవపాడు: పెళ్లి శుభలేఖలో ఓ వైపు వైఎస్సార్‌ మరో వైపు మీ ఫొటోలు ముద్రించామంటూ బ్యాంకు అధికారులు లోన్‌ ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని దర్శి మండలం రాజంపల్లికి చెందిన దేవరకొండ శ్రీను, శ్రీనివాసులురెడ్డి జగన్‌ వద్ద వాపోయారు. 2013లో తనకుమార్తె వివాహం సందర్భంగా ఇలా జరిగిందన్నారు. అయితే 2017లో ఎస్టీ లోన్ల కోసం దరఖాస్తు చేస్తే మంజూరు కాలేదని.. నువ్వు వైఎస్సార్‌ సీపీ అంటున్నారని విన్నవించారు. సమస్యను గ్రామ నాయకుడు శ్రీనివాసరెడ్డి వివరించారు.

చిన్నాపెద్దా అందరికీ కిడ్నీ వ్యాధులే!
పీసీపల్లి: వయసు భేదం లేకుండా చిన్నవారి నుంచి పెద్దవారి వరకు కిడ్నీ వ్యా«ధులు ఇబ్బందులు పెడుతున్నాయని తలమళ్ల గ్రామానికి చెందిన బీబీ జాన్, మర్రిచెట్లపాలెం గ్రామానికి చెందిన పెయ్యల నాగలక్ష్మి జగన్‌ను కలిసి మొరపెట్టుకున్నారు. బీబీజాన్‌ మాట్లాడుతూ తన భర్త ఖాశింకు 30 ఏళ్ల లోపే కిడ్నీలు పాడయ్యాయని తెలిపింది. తన ఏడాది బిడ్డకు రెండు కిడ్నీలు చెడిపోయినట్లు నాగలక్ష్మి విన్నవించుకుంది.

Advertisement
Advertisement