పీఈటీ కళాశాలల సంఖ్య పెంచండి అన్న.. | Sakshi
Sakshi News home page

పీఈటీ కళాశాలల సంఖ్య పెంచండి అన్న..

Published Wed, Aug 29 2018 8:16 AM

PET Colleges Shortage In Visakhapatnam - Sakshi

విశాఖపట్నం : రాష్ట్రంలో ప్రభుత్వ పీఈటీ కళాశాల ఒకటే ఉంది. అక్కడ బీపీఈడీకి 100, డీపీఈడీకి 100 సీట్లు ఉన్నాయి. మిగతావన్ని ప్రైవేటు కళాశాలలే.దీంతో చాలా మందికి ప్రభుత్వ వ్యాయా మ విద్య దక్కడం లేదు. ప్రైవేటు కళాశాలల్లో సరైన శిక్షణ ఇవ్వకుండా డబ్బులు తీసుకుని సర్టిఫికెట్లు ఇస్తున్నారు. ప్రభుత్వ కళాశాల ఒకటే ఉండటం వల్ల చాలా మంది ఈ శిక్షణకు నోచుకోవడం లేదు. రాష్ట్రంలో మరో పీఈటీ కళాశాల ఏర్పాటు చేయడంతోపాటు, పాఠశాలల్లో పీఈటీ పోస్టుల సంఖ్య పెంచాలి. ఈ విషయం పై జగనన్నకు వినతిపత్రం అందించాను.–ఎల్‌. ప్రసన్న, హరిపాలెం

గందరగోళంలో నిరుద్యోగులు
ప్రభుత్వ చర్యలతో నిరుద్యోగులు గందరగోళంలో ఉన్నారు. ఏటా డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చి టీచర్‌ పోస్టులు భర్తీ చేస్తామని చంద్రబాబు ఎన్నికల హామీ ఇచ్చారు. 2014లో టీఆర్టీ నిర్వహించి, అప్పటి నుంచి అదిగో ఇదిగో నోటిఫికేషన్‌ అంటూ ఊరిస్తున్నారు. డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇస్తామని మంత్రి గంటా చాలా సార్లు  ప్రకటించి వేయడం లేదు. లక్షలాది మంది ఉపాధ్యాయ నిరుద్యోగులు నోటిఫికేషన్‌ కోసం ఎదురుచూస్తున్నారు. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏటా డీఎస్సీ నోటిఫికేషన్‌ వేసి ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలి. – డయానా, డీఎడ్‌ విద్యార్థి, కోటనందూరు

Advertisement
Advertisement