పోలీసులా.. వీధి రౌడీలా? | Sakshi
Sakshi News home page

పోలీసులా.. వీధి రౌడీలా?

Published Sun, Jun 1 2014 2:06 AM

police or road romeo?

 అనంతపురం క్రైం, న్యూస్‌లైన్ : తమకు వ్యతిరేకంగా వార్త ప్రచురితమైందన్న అక్కసుతో గుంతకల్లు సాక్షి విలేకరి శ్రీనివాసులుపై గుంతకల్లు టాస్క్‌ఫోర్‌‌స పోలీసులు శనివారం దాడి చేశారు. ఇంట్లోకి చొరబడి మరీ పిడిగుద్దులు గుద్ది.. కర్రలతో చితకబాది వీధి రౌడీల్లా ప్రవర్తించారు. సార ్వత్రిక ఎన్నికల్లో అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా చూసేందుకు ఎస్పీ సెంథిల్‌కుమార్ గుంతకల్లు పోలీసు సబ్‌డివిజన్ పరిధిలోని పది మంది కానిస్టేబుళ్లతో ‘టాస్క్‌ఫోర్స్’ ఏర్పాటు చేశారు. సంఘ విద్రోహక శక్తుల ఆటకట్టించాల్సిన బృందంలోని ఆరుగురు కానిస్టేబుళ్లు నేరగాళ్లను గుర్తించి బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతూ వసూళ్ల పర్వానికి తెరలేపారు.
 
 దీనిపై బాధితులు జిల్లా అధికారులకు ఫిర్యాదులు చేశారు. వీటి ఆధారంగా ‘కలెక్షన్ ఫోర్స్’ శీర్షికన మే 31న సాక్షిలో వార్త ప్రచురితమైంది. ఈ కథానాన్ని చదివి రెచ్చిపోయిన పోలీసులు శనివారం మధ్యాహ్నం తర్వాత గుంతకల్లులోని సాక్షి విలేకరి శ్రీనివాసులు ఇంటిపై దాడి చేశారు. నిద్రపోతున్న విలేకరిని లేపి ‘ఏరా ఏం చూసుకుని వార్త రాశావు.. మా గురించి తెలిసి కూడా వార్త రాశావంటే నీకెన్ని గుండెలు..?’ అంటూ కర్రలతో పోలీసులు చితకబాదారు.
 
 ఈ కథనం జిల్లా కేంద్రంలోని వారు రాశారని, తనకే పాపం తెలియదని చెప్పినా వినకుండా బలంగా కొట్టడంతో విలేకరి స్పృహ కోల్పోయాడు. దాడిలో గాయపడి కదలలేని స్థితిలో ఉన్న విలేకరి చనిపోయాడేమోనని భయపడి అక్కడి నుంచి పోలీసులు ఉడాయించారు. ఇంతలో కాలనీవాసులు స్పందించి చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండ టంతో వైద్యుల సూచన మేరకు అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. విలేకరిపై దాడిని జర్నలిస్టు, కమ్యూనిస్టు, ప్రజా సంఘాల నేతలు తీవ్రంగా ఖండించారు. కాగా, మఫ్టీలో వచ్చి దాడికి పాల్పడిన కానిస్టేబుళ్లలో విలేకరి ఒకరిని గుర్తించి గుంతకల్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 

Advertisement
Advertisement