పుట్టీ మునుగుతోంది.. | Sakshi
Sakshi News home page

పుట్టీ మునుగుతోంది..

Published Sat, Oct 31 2015 1:12 AM

పుట్టీ మునుగుతోంది..

షికారు లేదు.. మరో ఉపాధి తెలియదు
ఆకలితో అలమటిస్తున్న మత్స్యకారుల కుటుంబాలు
పస్తులుంటున్నా పట్టించుకోని ప్రభుత్వం
 

 విజయపురిసౌత్ :  కృష్ణమ్మను నమ్ముకొని.. పుట్టీలనే ఆవాసంగా మార్చుకుని ఏటి ఒడ్డున జీవనం సాగిస్తున్న మత్స్యకారులు నేడు పూట గడవని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది సాగర్ జలాశయానికి కొత్తనీరు రాకపోవటంతో చేపల షికారు జరగడం లేదు. రోజు మొత్తం షికారు  ప్రభుత్వంవైపు చూస్తున్నారు. ఒక్క కృష్ణా జిల్లాలో 1.75లక్షల ఎకరాల్లో నాట్లు పడకపోగా, పడినచోట పంటలు ఎండిపోయే దుస్థితి కళ్లకు కడుతున్నా ఈ జిల్లాలో అసలు కరువు మండలమే లేదని ప్రభుత్వం తేల్చేసింది.

కరువు కోరలు చాస్తున్నా... కృష్ణా జిల్లాలో ఏటా 8.60 లక్షల ఎకరాలు సాగు విస్తీర్ణంగా ఉంటుంది. దీనిలో 6.34 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తుంటారు. ఈ ఏడాది ఇప్పటివరకు 4.64 లక్షల ఎకరాలే సాగు కాగా, మిగిలిన 1.70 లక్షల ఎకరాల్లో అసలు నాట్లు పడలేదు. డెల్టాలోని కాల్వల ద్వారా చివరి ప్రాంతాల్లోని భూములకు నీరు అందకపోవడమే ఇందుకు ప్రధాన కారణం.  ఆగస్టు 15నాటికల్లా  సాగు నీరు విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు, మంత్రి దేవినేని  ఆర్భాటంగా ప్రకటించినా నీరు విడుదల కాలేదు. అధికారులేమో సాగర్‌లో నీటిమట్టం తక్కువ ఉందని నీళ్లివ్వలేమని చెబుతున్నారు.

3,200 క్యూసెక్కులు మాత్రమే... ప్రస్తుతం పులిచింతలో 0.9 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. దీనిలో కొంత తాగునీటి అవసరాలకు కేటాయించి మిగిలిన నీటిని సాగునీటి కోసం విడుదల చేస్తున్నారు. రోజుకు 16 వేల క్యూసెక్కులు అవసరంకాగా,  3,200 క్యూసెక్కులు మాత్రమే వదులుతున్నారు.  కృష్ణాలో 21 మండలాల్లో వర్షపాతం సైతం తక్కువ నమోదైంది. రాజధాని జిల్లా అనే కారణంతో కృష్ణాను కరువు జిల్లాల జాబితాలోకి చేర్చలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 
గుంటూరులో గగ్గోలు...
రాష్ట్రప్రభుత్వం రెండో విడత ప్రకటించిన కరువు మండలాల జాబితాలో గుంటూరు జిల్లాకు చెందిన ఒక్క మండలం కూడా లేకపోవడం వ్యవసాయంపై ప్రభుత్వానికి ఉన్న చిన్నచూపును స్పష్టం చేస్తోంది. తక్షణం ప్రభుత్వం పునరాలోచన చేయాలని వ్యవసాయ నిపుణులు, ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. జిల్లాలో ప్రస్తుతం సాగునీటి సరఫరా లేక ఎండిపోయిన పంటలను రైతులు దున్నేస్తున్నారు. వ్యవసాయ కార్మికులు ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు వలస వెళుతున్నారు. వాస్తవానికి వర్షపాతం, జిల్లా కలెక్టర్ల నివేదిక, పంట దిగుబడి తగ్గుదల తదితర కోణాల్లో కరువు మండలాలను ప్రకటించినట్టు ప్రభుత్వం పేర్కొంటోంది. అయితే మండల అధికారులు క్షేత్రస్థాయిలోని పరిస్థితులను పరిశీలించకుండా అధికార యంత్రాంగానికి నివేదిక పంపడం వల్లనే జిల్లాలో కరువు మండలాల సంఖ్య పెరగలేదనే అభిప్రాయం ఉంది. పల్నాడులో మిర్చి, పత్తి, ఇతర వాణిజ్య పంటలు సాగునీరులేక ఎండిపోతు న్నాయి. డెల్టాలో పొట్టదశకు చేరుకున్న వరిని కాపాడుకునేందుకు రైతులు కాల్వలోని నీటిని డీజిల్ ఇంజన్లతో తోడి పొలాలు తడుపుతున్నారు. రోజూ అయిదు లేదా ఆరుగంటలు డీజిల్ ఇంజన్లు వినియోగించడంతో ఖర్చులు తడిసిమోపెడై అప్పుల పాలవుతున్నారు. వినుకొండ, మాచర్ల, గురజాల, నరసరావుపేట, బాపట్ల నియోజకవర్గాల్లోని పంటలు పూర్తిగా ఎండిపోయి రైతులు ఆందోళన చెందుతున్నారు. బాపట్ల నియోజకవర్గంలో ఎండిపోయిన వరిపొలాలను రైతులు దున్నేస్తున్నారు. నరసరావుపేట రూరల్, రొంపిచర్ల మండలాలు, వినుకొండలోని శావల్యాపురం, నూజెండ్ల మండలాల్లో కరువు పరిస్థితులు మరింత దుర్భరంగా ఉన్నాయి.
 
వైఎస్సార్ సీపీ వినతి...
సాగునీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్  ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) , గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కోన రఘుపతి,  నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు రావి వెంకట రమణ, జంగా కృష్ణమూర్తి, అన్నాబత్తుని శివకుమార్ తదితరులు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీధర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు.
 
 

Advertisement
Advertisement