ఎర్రచందనం స్వాధీనం | Sakshi
Sakshi News home page

ఎర్రచందనం స్వాధీనం

Published Thu, Sep 12 2013 2:39 AM

red sandalwood seized at ysr disrtrict

వీరబల్లి, న్యూస్‌లైన్ : సానిపాయి రేంజ్ పరిధిలోని వానరాజుపల్లె బీట్‌లోని కరివేపాకుపెంట ప్రదేశంలో బుధవారం అ క్రమ రవాణాకు గురవుతున్న 25ఎర్రచందనం దుం గలతో పాటు 16మంది కూలీలను అదుపులోకి తీసుకున్నట్లు రేంజర్ అబ్ధుల్‌ఖాదర్ తెలిపారు. ఎర్రచందనం కొయ్యలను లోడు చేసుకుని వెళ్తుండగా సిబ్బం దితో వెళ్లి వాహనాన్ని వెంబడించగా దుంగలు దొరికినట్లు పేర్కొన్నారు.
 
 మైదుకూరు, చెన్నూరు, ముడుం పాడు, కటారుమడుగు, చెల్లంపల్లెకు చెందిన మల్లికార్జున, రాగి చిన్న, కుడుముల గంగాధర, రాగి మల్ల య్య, ఆంజనేయులు, కానూరు శ్రీను, అంకయ్య, శ్రీను, మహేష్, సుబ్బరాయుడు, బూజూరు గంగులయ్య, కుడుమల నారాయణ, రాగి నాగార్జున, ఒంటిళ్ల వెంకటేష్, ఆదెయ్య, జిలకం శివయ్యలను అదుపులోకి తీసుకోగా నగిరిమడుగు వేణుగోపాల్‌నాయుడు, ముదే వెంకటమల్లునాయుడు పరారీలో ఉన్నారన్నారు. పట్టుబడిన కొయ్యలు టన్ను వరకు ఉంటాయని, వాటి విలువ సుమారు రూ.5లక్షలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఓ సుదర్శన్, బీట్ ఆఫీసర్లు హాజీబాషా, వెంకటేశ్వర్లు, ఏబీఓలు ఈశ్వరయ్య, సుధీర్‌బాషా, ట్రైకింగ్‌ఫోర్స్, బేస్‌క్యాంపు, ప్రొటెక్షన్ వాచర్లు పాల్గొన్నారు.
 
 తహశీల్దార్ కార్యాలయం సమీపంలో ..
 రైల్వేకోడూరు అర్బన్ : దాడులు నిర్వహించి 57ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు కోడూరు ఇన్‌చార్జ్ రేంజర్ శ్రీరాములు తెలిపారు. స్థానిక అటవీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రైల్వేకోడూరు పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయం సమీపంలో రైల్వేబ్రిడ్జి పక్కనున్న పొదల్లో ఎగుమతి చేసేందుకు దాచి ఉంచిన 57ఎర్రచందనం దంగలను స్వాధీనం చేసుకున్నామని, వాటి విలువ రూ.59వేలు చేస్తాయన్నారు. ఈ దాడుల్లో రాజంపేట ఇన్‌చార్జ్ రేంజ్ అధికారి పీవైఎన్ గౌడ్, వై.కోట సెక్షన్ అధికారి రఘునాథరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
 
 పెద్దముడియం మండలంలో...
 పాపాయపల్లెలో బుధవారం 16 ఎర్రచెందనం దుం గలను పొలీసులు పట్టుకున్నారు. విశ్వనీయ సమాచారం మేరకు గ్రామానికి చెందిన గజ్జల వెంకటసుబ్బారెడ్డి కొంతకాలంగా ఎర్రచెం దనం వ్యాపారం చేస్తున్నాడు. నిఘాపెట్టిన పోలీసులు కొద్దిరోజులుగా సమాచారం సేకరిస్తూ వస్తున్నారు. అందులో భాగం గా బుధవారం తెల్లవారుజామున వచ్చిన సమాచారం మేరకు  పొలీసులు గజ్జల వెంకటసుబ్బారెడ్డి కల్లంలో తనిఖీలు నిర్వహించారు. అక్కడే ఉన్న 16 ఎర్రచెందనం దుంగలు బయటపడ్డాయి. పట్టుబడిన దుంగలతోపాటు కారును, వెంకటసుబ్బారెడ్డిని ఎస్‌ఐ ప్రవీణ్ కుమార్ అదుపులోకి తీసుకున్నారు.
 

Advertisement
Advertisement