చిత్తూరులో గ్రీవెన్స్‌డే రద్దు | Sakshi
Sakshi News home page

చిత్తూరులో గ్రీవెన్స్‌డే రద్దు

Published Tue, Feb 18 2014 2:40 AM

RSS recreation Cancel

  •      చిత్తూరులో గ్రీవెన్స్‌డే రద్దు
  •      తిరుపతి, మదనపల్లెలోనూ స్తంభించిన పాలన
  •      ఈ-సేవల్లో నిలిచిన కార్యకలాపాలు
  •  ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుకు నిరసనగా ఎన్‌జీవోల సమ్మె కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా పాలనా వ్యవహారాలు సోమవారమూ స్తంభించాయి. చిత్తూరులోని కలెక్టరేట్, జిల్లా ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. ప్రతి సోమవారం నిర్వహించాల్సిన గ్రీవెన్స్‌డే రద్దయింది. ఉద్యోగుల సమ్మె కారణంగా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు గ్రీవెన్‌‌సడే రద్దయిన విషయం తెలియకుండా జనం కలెక్టరేట్‌కు వచ్చి నిరాశగా వెనుతిరిగి వెళ్లారు.
     
    సాక్షి, చిత్తూరు: జిల్లా వ్యాప్తంగా ఎన్జీవోల ఆందోళన కొనసాగు తోంది. కలెక్టరేట్‌లో తెరచి ఉన్న ఒకటి రెండు ప్రభుత్వ కార్యాలయాలను ఎన్‌జీవో నాయకులు మూయిం చారు. డ్వామా కార్యాలయం ముందు ఎన్‌జీవో అసోసియేషన్ నాయకులు ధర్నా చేశారు. జిల్లా వ్యాప్తంగా 66 తహశీల్దార్ కార్యాలయాలు మూతపడ్డాయి. పలమనేరులో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. తిరుపతిలో ఆర్‌డీవో కార్యాలయం మూతపడింది. మహిళా యూనివర్సిటీ విద్యార్థినులు తరగతులు బహిష్కరించి ఆందోళన చేశారు.

    కుప్పంలోనూ ఉద్యోగులు సమ్మెకు దిగారు. మదనపల్లెలోని ఆర్‌డీవో కార్యాలయంలో గ్రీవెన్స్‌డే రద్దు చేశారు. తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్లు, పుత్తూరు, పుంగనూరు, మదనపల్లె, నగరి, శ్రీకాళహస్తి మున్సిపాలిటీల్లోనూ జాయిం ట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు ఉద్యోగులు విధులు బహిష్కరించారు. ఇంటిపన్ను వసూలు, పరిపాలన అనుమతులు, కొళాయి కనెక్షన్లు మంజూరు వంటి  పనులు ఆగిపోయాయి. సర్టిఫికెట్ల జారీ నిలిచిపోయింది. పారిశుద్ధ్య నిర్వహణ వంటి అత్యవసర సేవలు మాత్రమే అందిస్తున్నారు.
     
    ఎక్కడి పనులు అక్కడే
     
    వారం రోజులుగా ఎన్‌జీవోలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెలో ఉండడంతో పరిపాలన పూర్తిగా స్తంభించింది. ఉపాధ్యాయులు, ఆర్‌టీసీ కార్మికులు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. వాణిజ్యపన్నులు, రవాణా, డీఈవో, రెవెన్యూ ఇలా అన్ని శాఖల ఉద్యోగులు సమ్మెలో ఉండడంతో ఎక్కడి ఫైల్స్ అక్కడే నిలిచిపోయాయి. అధికారులు కార్యాలయాలకు వస్తున్నా ఫైల్‌రాసే ఉద్యోగులు లేకపోవడంతో పనులు ముందుకు సాగడం  లేదు. హైదరాబాద్‌కు వార్షిక వర్‌‌క ప్లాన్లు పంపాల్సిన సమయమిదే. అయితే ఈ పనులేమీ జరగడం లేదు. ఈ-సేవ కేంద్రాలు మూతపడ్డాయి.
     
    బంగ్లాల నుంచే పాలన..
     
    కలెక్టర్ రాంగోపాల్, జాయింట్ కలెక్టర్ బసంతకుమార్‌లు బంగ్లాలోని క్యాంపు కార్యాలయం నుంచే పరిపాలన సాగిస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు తమ కార్యాలయాలకు వెళ్లి హైదరాబాద్ నుంచి అడిగే సమాచారం పంపి ఇంటి ముఖం పడుతున్నారు.
     

Advertisement
Advertisement