ఇసుకపై ‘మోకాలి’ శిక్ష | Sakshi
Sakshi News home page

ఇసుకపై ‘మోకాలి’ శిక్ష

Published Thu, Jul 31 2014 12:33 AM

ఇసుకపై ‘మోకాలి’ శిక్ష

అనంతపురం: ‘టీచర్లూ.. విద్యార్థులను కఠినంగా శిక్షించకండి.  ఇందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తే విద్యార్థులు బడికి రారు’- ఇదీ ఈ నెల25న అనంతపురం జిల్లా కదిరి మునిసిపల్ పాఠశాలలో ప్రారంభించిన ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉపాధ్యాయులకు చేసిన ఉద్బోధ. అయితే.. ఆయన సూచనలు ఉపాధ్యాయులకు వంట బట్టినట్టు లేవు.

అనంతపురం నగరంలోని గిల్డాఫ్ సర్వీస్ ఎయిడెడ్ పాఠశాలలో బుధవారం దినపత్రికలు చదవలేదని దాదాపు 20 మంది విద్యార్థినులను ఉపాధ్యాయులు ఇసుకలో మోకాళ్లపై నిలబెట్టి శిక్షించారు. దినపత్రికలు కొనే స్తోమతే వారి తల్లిద ండ్రులకుంటే.. తమ బిడ్డలను ప్రభుత్వ బడిలో చేరే వారా అన్న ఆలోచన కూడా వారికి రాలేదని ఆ దృశ్యాన్ని చూసినవారు  విమర్శించారు.
 
 

Advertisement
Advertisement