Sakshi News home page

సోమరాజు ఆధ్వర్యంలో శోభానాగిరెడ్డికి చికిత్స

Published Thu, Apr 24 2014 8:08 AM

సోమరాజు ఆధ్వర్యంలో శోభానాగిరెడ్డికి చికిత్స - Sakshi

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వైఎస్ఆర్సీపీ నాయకురాలు, ఆళ్లగడ్డ అసెంబ్లీ అభ్యర్థి శోభానాగిరెడ్డిని కాపాడేందుకు కేర్ ఆస్ప్రత్రి ఛైర్మన్ డాక్టర్ సోమరాజు పర్యవేక్షణలో మూడు బృందాలు పనిచేస్తున్నాయి. ఆర్థో, న్యూరో, క్రిటికల్ కేర్ బృందాలు ఆమెకు చికిత్స చేస్తున్నాయి. ప్రస్తుతం సీటీ స్కాన్ తీశారు. పూర్తి స్థాయిలో పరీక్షలు చేసిన తర్వాతే ఏ చికిత్స అందిస్తారో తెలుస్తుంది. పరీక్షలన్నీ పూర్తయ్యి, చికిత్స ప్రారంభం అయిన తర్వాత మాత్రమే తాము మీడియాకు అప్డేట్ ఇవ్వగలమని వైద్యులు చెప్పారు. మొత్తం చికిత్స అంతా కేర్ ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ సోమరాజు పర్యవేక్షణలోనే జరుగుతోంది. అయితే 48 గంటల పాటు పూర్తిగా పరిశీలించిన తర్వాత మాత్రమే ఏ విషయమైనా చెప్పగలమని వైద్యులు అంటున్నారు. ఆమె మెడకు తీవ్ర గాయం అయ్యిందని, కంటి పైభాగంలో కూడా గాయం అయ్యిందని చెబుతున్నారు. వాహనం బాగా వేగంగా ప్రయాణిస్తున్నప్పుడు ప్రమాదం జరిగి, వాహనం అద్దాలు పగిలి శోభానాగిరెడ్డి రోడ్డుపై పడటంతో బలమైన గాయాలైనట్లు ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు.

ఆమెకు తగిలిన గాయాల కారణంగా.. క్రిటికల్ కేర్ వైద్యులు ప్రధానంగా ఆమెను కంటికి రెప్పలా కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆర్థో టీంలో ముగ్గురు, న్యూరో టీంలో ముగ్గురు నలుగురితో పాటు క్రిటికల్ కేర్ విభాగంలోని ఓ పెద్ద బృందం ఆమకు చికిత్స అందిస్తోంది. దాదాపు మరో గంట సమయంలో హెల్త్ బులెటిన్ విడుదల అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎలా ఉందో మాత్రం తాము చెప్పలేమని వైద్యులు అంటున్నారు. అయితే ఆమెకు ఇంటర్నల్ బ్లీడింగ్ (అంతర్గత రక్తస్రావం) జరుగుతోందని మాత్రం తెలిసింది.

Advertisement

What’s your opinion

Advertisement