కష్టపడితేనే ఫలితాలు | Sakshi
Sakshi News home page

కష్టపడితేనే ఫలితాలు

Published Fri, Jan 3 2014 3:58 AM

The results of hard work

 నిజామాబాద్ సిటీ, న్యూస్‌లైన్: ఈ ఆర్థిక సంవత్సరం ముగి యడానికి మరో మూడు నెలల సమ యం ఉన్నందున అధికార యంత్రాం గం,ప్రజాప్రతినిధులు సమష్టిగా కృషి చేస్తే మంచి ఫలితాలు వస్తాయని మంత్రి సుదర్శన్‌రెడ్డి అన్నారు. నూ తన సంవత్సర వేడుకలలో భాగంగా గురువారం రాత్రి జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో అధికారులు, మీడియా ప్రతినిధుల ‘గెట్ టు గెదర్’ నిర్వహించారు.
 
 ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ నందిపేట మండలంలో 400 ఎకరాలలో 17 ర కాల ఆహార పదార్థాలు తయారు చేసే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు అనుమతి వచ్చిందన్నారు. రూ. 50 కోట్ల సబ్సిడీ ఈ పరిశ్రమకు లభించనుందన్నారు. ఐదు నుంచి పది వేల మందికి ఉపాధి దొరికే అవకాశముం దన్నారు. 2014లో జిల్లా ప్రజలకు ఇదొక శుభ పరిణామమన్నారు.
 
 వ్యవసాయం ద్వారా ఆదాయం
 జిల్లాలో రైతులు బాగా కష్టపడుతున్నందున వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా ఈ సంవత్సరం రెండు పంటలకుగాను రూ. నాలుగు వేల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు. రైతులకు విత్తనాల ఇబ్బంది లేకుండా ఈ సంవత్స రం సీడ్ ప్రాసెసింగ్ యూనిట్ పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సంవత్సరంలో సోయా పంట మూడు లక్షల ఎకరాలలో పండిస్తున్నారని, రైతులను ఆదుకుంటామన్నా రు. జిల్లాలో పాల కేంద్రం సక్రమంగా లేదని, దీనిపై కలెక్టర్ దృష్టి సారిస్తే చిన్న పిల్లలకు నా ణ్యమైన పాలు అందించవచ్చన్నారు. జిల్లాలో మంచి నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.
 
 ప్రత్యేకంగా ప్రసూతి ఆస్పత్రి
 15 రోజులలో వైద్య కళాశాలకు, ఆస్పత్రికి కొత్త  గా అధికారులు,సిబ్బంది వస్తున్నారని మంత్రి తెలిపారు. ఈఎస్‌ఐ ఆస్పత్రిని 150 పడకలకు పెంచి, దానిని కేవలం ప్రత్యేకంగా ప్రసూతి కోసం కేటాయించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌ను అనువైన చోటుకు తరలించేందుకు అధికారులు ఆలోచించాలన్నారు. తద్వారా ఆస్పత్రికి మరిం     త అనుకూలంగా సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి వీలవుతుందన్నారు. కొత్త కలెక్టర్ కార్యాలయం కోసం నిధుల మంజూరుకు కృషి చేస్తానన్నారు.
 
 ఇంజినీరింగ్ అధికారుల పనితీరు బాగుండాలి
 ఈ సంవత్సరం జిల్లా అధికారులు, ముఖ్యంగా ఇంజినీరింగ్ అధికారులు మరింతగా కష్టపడాలని కలెక్టర్ ప్రద్యుమ్న సూచించారు. పనులను సకాలంలో పూర్తి చేసి ల క్ష్యాలను అధిగమించాలన్నారు. మండల, డివిజన్ స్థాయి అధికారు లు క్షేత్ర స్థాయిలో పనులు పూర్తి చేయడానికి చ ర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా స్థాయి అధికారులు సరైన సూచనలు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ హర్షవర్ధన్, అదనపు జేసీ శేషాద్రి, బోధన్ సబ్ కలెక్టర్ హరి   నారాయణన్, ఎస్‌పీ తరుణ్‌జోషీ, రాష్ట్ర గిడ్డం    గుల అభివృద్ధి మండలి చైర్మన్ మహేష్‌కుమార్‌గౌడ్, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement