హైదరాబాద్ అందరిదీ | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ అందరిదీ

Published Mon, Sep 15 2014 12:15 AM

హైదరాబాద్ అందరిదీ

నిస్సంకోచంగా  పెట్టుబడులు పెట్టండి
ఉచిత పథకాలతో దేశ ప్రగతికి చేటు
ఇక విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు
కేంద్రమంత్రి వెంకయ్యునాయుుడు

 
హైదరాబాద్: ప్రస్తుత తరుణంలో ప్రపంచంలోని అన్ని పరిశ్రమలు హైదరాబాద్‌వైపు చూస్తున్నాయని వాటిని ఆకర్షించే శక్తి భాగ్యనగరానికే ఉందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి  వెంకయ్యనాయుడు అన్నారు.  ఉప్పల్ పారిశ్రామిక వాడలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రెటరీస్ ఆఫ్ ఇండియా సంస్థకు చెందిన సెంటర్ ఫర్ ఎక్సెలెన్స్ కార్యాలయ భవన శంకుస్థాపన కార్యక్రమానికి ఆదివారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమలను మరింత ప్రోత్సహిస్తే ఇంకా అభివృద్ధి జరుగుతుందన్నారు. ఈ నగరంలో ఉన్న ప్రతి ఒక్కరూ హైదరాబాదీలేనని, భాగ్యనగరం మన అందరిదన్నారు. దీనిపై  అందరికీ సమాన హక్కులున్నాయని, ఎవరైనా పెట్టుబడులు నిస్సంకోచంగా పెట్టవచ్చని సూచించారు.

కల్లు గీయడం, కుండలు చేయడం లాంటి కళలు, పోచంపల్లి, కంచి పట్టు లాంటి చీరలు తయారు చేయడం మనం తప్ప మరే దేశం చేయలేదన్నారు. ఇక నుంచి ఎవరూ విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదని అన్ని సౌకర్యాలు మనదేశంలో ఉన్నాయని తెలిపారు. ఉచిత పథకాల వల్ల దేశ ప్రగతి కుంటుపడుతుందని అలాం టివి ప్రోత్సహించ వద్దన్నారు. తెలుగు వారు రెండు రాష్ట్రాలుగా విడిపోయినా మనందరం భారతీయులమని గుర్తు పెట్టుకోవాలన్నారు. ప్రాంతీయత పేరిట విద్వేషాలను రెచ్చగొట్టే వారి ని దూరం పెట్టాలని కోరారు. జన్‌ధన్  కార్యక్రమాన్ని రూపొందించి 15 రోజు ల్లో  మూడు కోట్ల మందికి బ్యాంకు ఖాతాలు ఇప్పించామన్నారు.  

రైతు రుణ మాఫీ శాశ్వత పరిష్కారమా?

వ్యవసాయ రంగానికి రైతు రుణ మాఫీ శాశ్వత పరిష్కారమా అని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్య   సూటిగా ప్రశ్నించారు. రైతు నేస్తం వ్యవసాయ మాసపత్రిక పదో వార్షికోత్సవం సందర్భంగా ఆది వారం జరిగిన రైతు నేస్తం పురస్కారాలు-2014 కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నా రు. వ్యవసాయ రంగానికి అప్పుల మాఫీ కంటే ఉత్పత్తులకు గిట్టుబాటు ధర అవసరమన్నారు. బ్యాంకులు రైతులకు ఇచ్చే అప్పులు ప్రజల డబ్బు అని, ప్రజల సొమ్ముపై కొద్దిపాటి లాభాలతో రైతులకు ఇచ్చే రుణాలను మాఫీ చేస్తే దివాళా తీస్తాయని పేర్కొన్నారు. వ్యవసాయూనికి ఉచిత విద్యుత్ కంటే నాణ్యమైన పదిగంటల విద్యుత్ అవసరమని స్పష్టం చేశారు. వచ్చే మూడేళ్లలో ప్రతిరైతు కూ వ్యవసాయ భూసార కార్డులు అందించేం దుకు ప్రధాని నరేంద్రమోడీ కృతనిశ్చయంతో ఉన్నారని మంత్రి ప్రకటించారు. కార్యక్రవుంలో నాబార్డు రిటైర్డ్ సీజీఎం పాలాది మోహనయ్య, మాజీ రాజ్యసభ సభ్యులు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ప్రసంగించారు. వ్యవసాయ రంగంలో సేవలు అందిస్తున్న వారికి పురస్కారాలు అందించారు. పురస్కారం అందుకున్న వారిలో సాక్షి దినపత్రిక సబ్ ఎడిటర్ జిట్టా బాల్‌రెడ్డి ఉన్నారు.
 
 రైతు నేస్తం పురస్కార గ్రహీతలు

జీవితసాఫల్య పురస్కారం: డా.ఎల్.జలపతి రావు( ఏఎన్‌జీఆర్‌ఏయూ రిటైర్డ్ రిజిస్ట్రార్)
శ్రమధాత్రి పురస్కారం: జి.మునిరత్నమ్మ(చిత్తూరు), రైతు విభాగం: పారినాయుడు(విజయనగరం), సామినేని
హిమవంతరావు(ఖమ్మం), ఎం.విజయరామకుమార్ (కృష్ణా), దండా వీరాంజనేయులు(ప్రకాశం), ఎస్.స్తంభాద్రిరెడ్డి (మహబూబ్‌నగర్), పి.పావని (రంగారెడ్డి), మేకల వేణు, ఎం.నాగేశ్వరరావు (గుం టూరు), భూక్యా బాలగంగాధర్ నాయక్(అనంతపురం), గోదాసు నర్సింహా (నల్లగొండ), మహమ్మద్ రియాజుద్దీన్ (నిజామాబాద్).
 
శాస్త్రవేత్తల విభాగం: ఆర్. రాఘవయ్య, ఆర్‌వీఎస్‌కే రెడ్డి(హైదరాబాద్), వై.కోటేశ్వర్‌రావు(గుంటూరు), జె.కృష్ణప్రసాద్ (బాపట్ల),   టి.స్వర్ణలతాదేవి (కడప), కె.జలజాక్షి(అనంతపురం), జి.జయశ్రీ, కె. విజయలక్ష్మీ(హైదరాబాద్), ఎం.కిషన్‌కుమార్, వై.ఆంజనేయులు, బి.రమేష్‌గుప్తా(కరీంనగర్). విస్తరణ విభాగం: వి. లక్ష్మారెడ్డి, డి. చక్రపాణి (మెదక్), పి. గురుమూర్తి(విజయనగరం), బి. మురళీధర్(ఆదిలాబాద్), ఎం. సరితారెడ్డి(హైదరాబాద్). అగ్రి జర్నలిజం విభాగం: జిట్టా బాల్‌రెడ్డి (సాక్షి), చాపల శ్రీవకుళ (ఈటివి), కందిమళ్ల వెంకట్రావు (ఆంధ్రజ్యోతి), పి.రామచందర్‌రావు (99 టివి), మట్టిమనిషి కార్యక్రమం (టి న్యూస్), భూమిపుత్ర కార్యక్రమం (మా టీవీ).
 

Advertisement
 
Advertisement
 
Advertisement