నేడు ఇస్రో చైర్మన్ డాక్టర్ రాధాకృష్ణన్ రాక | Sakshi
Sakshi News home page

నేడు ఇస్రో చైర్మన్ డాక్టర్ రాధాకృష్ణన్ రాక

Published Wed, Oct 30 2013 3:40 AM

To day Infra chairman Dr.Radhakrisha arriveing to nellore district

సూళ్లూరుపేట, న్యూస్‌లైన్ : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ డాక్టర్ కే రాధాకృష్ణన్ బుధవారం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని షార్‌కు విచ్చేయనున్నారు. షార్‌లోని మొదటి ప్రయోగ వేదికపై పీఎస్‌ఎల్‌వీ సీ25 రాకెట్ అనుసంధానం పనులు పూర్తి చేసుకుని ప్రయోగానికి సిద్ధంగా ఉంది. ఆయన రాకెట్‌కు తుది విడత తనిఖీలు నిర్వహించి లాంచ్ రిహార్సల్స్ నిర్వహించనున్నారు.
 
 జాతీయ మీడియాతో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు షార్ అధికార వర్గాలు తెలియజేశాయి. అనంతరం సహచర శాస్త్రవేత్తలతో ఆయన ప్రయోగంపై చర్చించనున్నారు. అంగారకుడిపై పరిశోధనలు చేయడానికి చేస్తున్న మొట్ట మొదటి ప్రయోగం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు ప్రతి అంశాన్ని సున్నితంగా పరిశీలిస్తున్నారు. బుధవారం మిషన్ కంట్రోల్ రూం నుంచి లాంచ్ రిహార్సల్స్ ఆయన పర్యవేక్షణలో నిర్వహిచనున్నారు. అంతా సక్రమంగా జరి గితే నవంబర్ 3న సాయంత్రం 6 గంటలకు కౌట్‌డౌన్ ప్రక్రియ, 5న మధ్యాహ్నం 2.36 గంటలకు ప్రయోగం చేసేందుకు సన్నాహాలు పూర్తి చేశారు.

Advertisement
Advertisement