నేటి నుంచి ఎల్లారమ్మజాతర | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఎల్లారమ్మజాతర

Published Sat, Mar 8 2014 2:52 AM

today onwards yellama jathara

 జామి,న్యూస్‌లైన్:
 భక్తుల  కొంగుబంగారం, ఉత్తరాంధ్రలో  ప్రసిద్ధిగాంచిన జామి ఎల్లారమ్మ జాతర నేటినుంచి ప్రారం భం  కానుంది. శనివారం  తొలేళ్ల ఉత్సవం, ఆదివారం  జాతర నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లూ పూర్తిచేశారు. ఈ జాతరకు ఉత్తరాంధ్రలోని పలుప్రాంతాలనుంచి, ఇతర రాష్ట్రాల  నుంచి భక్తులు  సుమారు లక్షకు  పైగా హజరవుతారు. ప్రతి ఏడాది దేవాదాయకమిటీ ఆధ్వర్యంలో జాతర నిర్వహించేవారు. ఈ సంవత్సరం ఎన్నికల కోడ్ అమలు, న్యాయస్థానం ఉత్తర్వుల  మేర కు ప్రభుత్వం ఉత్సవ కమిటీలను రద్దుచేయడంతో  దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోనే నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాదీ పాల్గుణ శుద్ధ అష్టమి రోజున జాతర నిర్వహించడం అనావాయితీగా  వస్తోంది.
 
 ఏర్పాట్లు పూర్తి
 జాతరకు  సంబంధించి  అన్ని ఏర్పాట్లూ పూర్తిచేశారు. అమ్మవారి దర్శన నిమిత్తం బారికేడ్లను ఏర్పాట్లు చేశా రు. ఆలయానికి రంగులు వేసి సుందరంగా తీర్చి దిద్దా రు. ముందుజాగ్రత్త చర్యగా మేజర్ పంచాయతీ సర్పంచ్  ఇప్పాక వెంకట త్రివేణి, ఈఓ కేవీ.రమణ ఆధ్వర్యంలో  గ్రామంలోని తాగునీటి  బోర్లలో  క్లోరినేషన్  చేస్తున్నారు. జాతర సందర్భంగా రెండుపూటలా  తాగునీటి సరఫరా  ఇవ్వనున్నారు. ఎంపీడీఓ  సీహెచ్.లక్ష్మీబాయి, ఈఓపీఆర్‌డీ కె.ధర్మారావు, ఆలయ ప్రాంగణం  వద్ద  ఏర్పాట్లను  పరిశీలించారు. జాతర లో  జామి  పీహెచ్‌సీ ఆధ్వర్యంలో  వైద్యశిబిరం  నిర్వహిస్తున్నారు. 108 వాహనాన్ని  జాతరలో  సిద్ధంగా ఉంచడానికి సంబంధిత అధికారులతో మాట్లాడినట్లు  ఎంపీడీఓ  లక్ష్మీబాయ్  తెలిపారు.
 
 పోలీస్ బందోబస్తు
 జాతరలో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా గట్టి పోలీస్ బందో బస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్సై ఎం.ప్రశాంత్‌కుమార్ తెలిపారు. 130 మంది సిబ్బందిని నియమించామని చెప్పారు.
 
 జాతరకు  సహకరించాలి
 జాతరకు అందరూ సహకరించాలని  దేవాదాయశాఖ  ఈఓ వి.అప్పారావు కోరారు. అమ్మవారిదర్శనానికి ఈ ఏడాది ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వీఐపీ పాస్ లు రద్దుచేశామన్నారు. శీఘ్రదర్శనానికి 20,ప్రత్యేకద ర్శనానికి 10, విశిష్టదర్శనానికి 30 చొప్పున ఖరారు చేశామన్నారు. వికలాంగులు, వృద్ధులు విశిష్ట దర్శనం క్యూలోఅమ్మవారిని సందర్శించ వచ్చునని చెప్పారు.
 
 
 

Advertisement
Advertisement