నత్తనడకన ట్రైకార్ | Sakshi
Sakshi News home page

నత్తనడకన ట్రైకార్

Published Wed, Mar 2 2016 11:47 PM

Traikar grinding units

పార్వతీపురం: జిల్లాలో ఐటీడీఏ ద్వారా అమలవుతున్న ట్రైకార్ యూనిట్ల గ్రౌండింగ్ ఏడాది కాలం పాటు ఆలస్యమవుతున్నాయి. 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అమలు కావల్సిన ట్రైకార్ యూనిట్ల మంజూరు, గ్రౌండింగ్, 2015-16కు సంబంధించి గ్రౌండింగ్ ఏడాది కాలం ఆలస్యంగా ఆరంభమవుతున్నాయి. అంతేకాకుండా 2013-14కు సంబంధించి యూనిట్ల గ్రౌండింగ్ ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయి. యూనిట్లకు సంబంధించి యూసీలు ఐటీడీఏ కార్యాలయానికి ఇప్పటికీ చేరలేదు.
 
  2014-15కు సంబంధించి 491 యూనిట్లు రూ. 3.51కోట్లతో మంజూరు కాగా ఇప్పటివరకు 432 యూనిట్లు గ్రౌండింగ్ చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వీటిలో ఇప్పటికీ 50 వరకు యూసీలు కార్యాలయానికి చేరలేదు. ఇప్పటికీ 2014-15కు సంబంధించిన యూనిట్ల గ్రౌండింగ్ కొనసాగుతుండగా 2015-16కు సంబంధించి యూనిట్లను ఇటీవల మంత్రి రావెల కిశోర్ ప్రారంభించారు. వీటి గ్రౌండింగ్ ఈ నెలాఖరుకు పూర్తికావల్సివుంది. ఇప్పుడిప్పుడే వీటి పనులు ప్రారంభం అవుతున్నాయి. 2015-16కు సంబంధించి 1019 యూనిట్లకు రూ. 16.46కోట్లు మంజూరవ్వగా వీటి గ్రౌండింగ్ ఈ ఏడాదంతా పట్టే అవకాశం లేకపోలేదు. ఇదే అదనుగా టీడీపీ తమ్ముళ్ళు ట్రైకార్ లబ్ధిదారుల ఎంపిక తమ గుప్పెట్లో ఉంచుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
 

Advertisement
Advertisement