Sakshi News home page

ప్రత్యేక హోదాకు మార్చి 2నే ఆమోదం: జైరామ్

Published Wed, Jun 4 2014 1:09 AM

ప్రత్యేక హోదాకు మార్చి 2నే ఆమోదం: జైరామ్ - Sakshi

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించేందుకు మార్చి 2నే కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్ తెలిపారు. ప్రత్యేక హోదా అమలుకు ప్రణాళికా సంఘాన్ని సైతం కేంద్ర కేబినెట్ ఆదేశించిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే జూన్ 8వ తేదీ నుంచి ఇది అమల్లోకి వచ్చేలా ప్రణాళిక సంఘం నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉందని పేర్కొన్నారు.

మంగళవారం రాజ్యసభ సభ్యుడు చిరంజీవి నివాసంలో చిరంజీవి, మరో రాజ్యసభ సభ్యుడు జేడీ శీలంతో కలసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘ప్రధానమంత్రి రాజ్యసభలో ఇచ్చిన హామీ అది. ఆయన అధ్యక్షతన జరిగిన కేబినెట్ ఆ నిర్ణయాన్ని ఆమోదించింది. అమలు కోసం ప్రణాళిక సంఘాన్ని ఆదేశించింది. జాతీయ అభివృద్ధి మండలి అనుమతి అవసరం లేదు. ఆమోదం మాత్రమే అవసరం. ప్రణాళిక సంఘం ఇందుకోసం జూన్ 8లోగా నోటిఫికేషన్ జారీచేయాల్సి ఉంది’ అని జైరామ్ చెప్పారు.
 

Advertisement

What’s your opinion

Advertisement