వారసులొస్తున్నారు | Sakshi
Sakshi News home page

వారసులొస్తున్నారు

Published Wed, Feb 26 2014 8:31 AM

వారసులొస్తున్నారు - Sakshi

సాక్షి ప్రతినిధి, ఏలూరు : జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన సీనియర్ నాయకుల వారసులు కొందరు రానున్న ఎన్నికల కదన రంగంలోకి దూకేం దుకు ఉవ్విళ్లూరుతున్నారు. కుటుంబ పెద్దల రాజకీయ నేపథ్యం, పేరు ప్రఖ్యాతులే ఆయుధంగా జూనియర్లు ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారు.
 
ఇప్పటికే పలువురు వివిధ పార్టీల్లో చేరి దూసుకెళుతుండగా.. మరికొందరు అనువైన నియోజకవర్గాల కోసం, అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. వారసుల హడావుడి, ప్రయత్నాల నేపథ్యంలో జిల్లా రాజకీయాలో ఒకింత కొత్తదనం కనిపిస్తోంది. వీరందరికీ అవకాశం వస్తుందో లేదో తెలియదుగానీ వారి హడావుడి మాత్రం చర్చనీయాంశమవుతోంది. 
 
 కృష్ణబాబు కుటుంబం నుంచి...
 కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల వెంకట కృష్ణారావు (కృష్ణబాబు) వారసునిగా ఆయన అల్లుడు ఎస్.రాజీవ్‌కృష్ణ రాజకీయాల్లో ప్రవేశించిన విషయం తెలిసిందే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైన కృష్ణబాబు తనకున్న అపార  అనుభవంతో రాజీవ్‌కృష్ణను రాజకీయాల్లో నిలబడేలా చేసేందుకు పావులు కదుపుతున్నారు. వైఎస్సార్ సీపీ నిడదవోలు నియోజకవర్గ సమన్వయకర్తగా రాజీవ్‌కృష్ణ చురుగ్గా పని చేస్తున్నారు.
 
ఒకప్పుడు జిల్లా రాజకీయాలను శాసించిన కృష్ణబాబు వారసత్వంతోపాటు కష్టపడి పనిచేస్తూ ఆయ న నిత్యం ప్రజల మధ్యే ఉంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పుడుతున్న ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు కుమారుడు అనంత వెంకటరమణచౌదరి వైఎస్సా ర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకునిగా వ్యవహరిస్తున్న వెంకటరమణ చౌదరి రెండు జిల్లాల్లోనూ విస్తృతంగా తిరుగుతున్నారు. 
 
 ముళ్లపూడి కుటుంబం నుంచి...
 జిల్లా రాజకీయాల్లో తలపండిన ముళ్లపూడి కుటుంబ రాజకీయ వారసునిగా బోళ్ల రాజీవ్ తెరపైకి వచ్చారు. ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్, బోళ్ల బులి రామయ్య, వైటీ రాజా తర్వాత ఆ కుటుంబం నుంచి రాజీవ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. బులిరామయ్య మనుమడైన రాజీవ్ రాబోయే ఎన్నికల్లో ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ సీటు కోసం ప్రయత్నిస్తున్నారు. నారా లోకేష్‌తో సన్నిహితంగా ఉంటూ రాజకీయాలు నెరుపుతున్నా రు. ఆయన ప్రయత్నం నెరవేరే అవకాశాలు తక్కువగానే ఉన్నా ప్రముఖ కుటుంబం నుంచి వచ్చిన నేతగా అం దరి దృష్టిలో పడ్డారు.
 
మాజీ ఎంపీ, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాగంటి బాబు రాజకీయ వారసునిగా ఆయన పెద్దకుమారుడు రాంజీ కొద్దిరోజు లుగా హడావుడి చేస్తున్నారు. ఇటీవల తాడేపల్లిగూడెంలో జరిగిన టీడీపీ ప్రజాగర్జన సభలోనూ రాంజీ హడావుడి కనిపించింది. రాంజీకి దెందులూ రు టీడీపీ సీటు ఇప్పించేందుకు బాబు ప్రయత్నాలు చేసినట్టు ప్రచారం జరి గింది. ప్రస్తుతం మాగంటి బాబు ఏలూరు లోక్‌సభ సీటు రేసులో ఉన్నప్పటికీ.. ఏమాత్రం అవకాశం ఉన్నా రాంజీని తెరపైకి తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు కనబడుతోంది. అందుకు అనుగుణంగానే రాంజీ వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ నేతలందరితో మాట్లాడుతున్నారు. 
 
 కోటగిరి వారసునిగా...
 ఇటీవల మృతి చెందిన మాజీ మంత్రి కోటగిరి విద్యాధరరావు కుమారుడు శ్రీధర్ తాజాగా రాజకీయాల్లోకి ప్రవేశించారు. తెలుగుదేశం హయాంలో మంత్రిగా విద్యాధరరావు ఒక వెలుగు వెలిగి ఆ తర్వాత పీఆర్పీ, కాంగ్రెస్ పార్టీల్లో పనిచేశారు. ఆయన మరణానంతరం శ్రీధర్ బీజేపీలో చేరి ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గం కేంద్రంగా పనిచేస్తున్నారు.
 
గతంలో పీసీసీ తాత్కాలిక అధ్యక్షునిగా పనిచేసిన కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే జీఎస్ రావు కుమారుడు శ్రీనివాసనాయుడు కూడా అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. గత ఎన్నికల్లోనే ఆయన కాంగ్రెస్ తరఫున నిడదవోలు నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యూరు. రాబోయే ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా వారసుల రాకతో రాజకీయాలు కొత్తరూపు సంతరించుకుంటున్నాయి. 
 

Advertisement
Advertisement