నాన్నగారు మా వస్త్రాలే ధరించేవారన్నా.. | Sakshi
Sakshi News home page

నాన్నగారు మా వస్త్రాలే ధరించేవారన్నా..

Published Thu, Dec 6 2018 7:35 AM

YS Jagan Meet Ponduru Cotton Cloth merchants - Sakshi

శ్రీకాకుళం ,పొందూరు: వైఎస్‌ రాజశేఖర రెడ్డి తాము నేసిన ఖద్దరు వస్త్రాలనే ధరించేవారని, ఆ రోజుల్లో తమకు ఎంతో ఆదరణ లభించేదని పొందూరు ఖాదీ పరిశ్రమ కార్మికులు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి చెప్పారు. ప్రజా సంకల్ప యాత్ర వస్తుం దని తెలుసుకొని పొందూరు (ఏఎఫ్‌కేకే సంఘం) ఖాదీ పరిశ్రమ అంబేడ్కర్‌ కూడలిలో పొందూరు ఖాదీ వస్త్ర తయారీ ప్రక్రియలను ఏర్పాటు చేశారు. అక్కడకు చేరుకొన్న జగన్‌మోహన్‌రెడ్డికి స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా కార్మికులు వారి జ్ఞాపకాలను పంచుకున్నారు. అనంతరం జగన్‌ వారితో మాట్లాడుతూ నవరత్నాలులో మీకు అవసరమైన సంక్షేమ పథకాలన్నీ ఉన్నాయని, వాటితో పాటు అదనంగా మీకు అవసరమైన ప్రయోజనాలు కావాలంటే పరిశీలన చేసి ఆదుకొంటానని చెప్పారు.జాతీయ అవార్డు గ్రహీత కోరుకొండ సరో జినితో మాట్లాడుతూ అందరి సమస్యలు తీరుస్తానని భరోసా ఇచ్చారు. ఆయనకు సమస్యలను విన్నవించిన వారిలో ఏఎఫ్‌కేకే సంఘం అ«ధ్యక్షులు జీకే ప్రసాద్, కార్యదర్శి దండా వెంకటరావు, కార్మికులు కోరుకొండ సరోజనీ, కాప ల చిన్నమ్మడు తదితర కార్మికులు ఉన్నారు.

Advertisement
Advertisement