గిరిజనం గుండెల్లో.. | Sakshi
Sakshi News home page

గిరిజనం గుండెల్లో..

Published Thu, Jul 14 2016 2:38 AM

గిరిజనం గుండెల్లో.. - Sakshi

 ముంపు బాధితులకు అండగా ఉంటామని వైఎస్ జగన్ భరోసా
 కుక్కునూరులో రోడ్ షో
 30 కిలోమీటర్లు.. మూడు గంటలు

 
సాక్షి ప్రతినిధి, ఏలూరు : గిరిజనం కదిలి వచ్చింది. అభిమాన నేతను గుండెలకు హత్తుకుంది. విలీన మండలాల్లో ముంపు బాధితులకు అండగా ఉంటానన్న వైఎస్సార్ సీపీ అధినేత, విపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనకు అడుగడుగునా కుక్కునూరు మండలం బ్రహ్మరథం పట్టింది. కుక్కునూరు నుంచి వేలేరు వరకు 30 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి మూడు గంటల సమయం పట్టిందంటే జన స్పందన ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తమ కోసం వచ్చిన నేతను చూడటానికి వేలేరుపాడు మండలంలో గోదావరి వరద ముంపులో ఉన్న ప్రజలు పడవలపై తరలి వచ్చి మరీ తమ అభిమానం చాటుకున్నారు.
 
 బుట్టాయగూడెం నుంచి మొదలై..
బుట్టాయగూడెం మండలంలోని మారుమూల గ్రామమైన దుద్దుకూరు నుంచి బుధవారం ఉదయం పర్యటన ప్రారంభించిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి గిరిజన గ్రామాలు జేజేలు పలి కాయి. గ్రామాల్లోని జనమంతా రోడ్లపైకి రావడంతో పర్యటన ఆలస్యమైంది. బుట్టాయగూడెం మండలం ముప్పినవారిగూడెం ఎస్సీ కాలనీ వద్ద ఏర్పాటు చేసిన దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలను జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరిం చారు. అక్కడే  తెలుగుదేశం నేత నడిపల్లి వెంకటరమణ ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యకర్తలు వైఎస్సార్ సీపీలో చేరారు.
 
 అనంతరం కరాటం చిన్నరాయుడు ఇంటికి చేరుకున్న వైఎస్ జగన్ నవ వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం ఆయన జంగారెడ్డిగూడెం బయలుదేరగా, నాయకులు, కార్యకర్తలు బుట్టాయగూడెం నుంచి జంగారెడ్డిగూడెం వరకూ భారీ మోటార్ సైకిల్ ర్యాలీతో అనుసరించారు. జంగారెడ్డిగూడెంలోని పొగాకు వేలం కేంద్రాలను పరిశీలించిన వైఎస్ జగన్ అక్కడ పొగాకు రైతులతో మాట్లాడారు. గిట్టుబాటు ధర రాకపోవడం వల్ల పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
 
వారికి అన్నివిధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అక్కడి నుంచి జీలుగుమిల్లి చేరుకున్న ఆయనకు జల్లేరు రిజర్వాయర్ ముంపు గ్రామాలైన తాటిరామన్నగూడెం, జిల్లెళ్లగూడెం, లంకాలపల్లి, బొత్తప్పగూడెం నిర్వాసిత గిరిజనులు గోడు విన్నవించుకున్నారు. జల్లేరు ముంపు నిర్వాసితులకు ప్రభుత్వం ఎటువంటి పునరావాసం కల్పించడం లేదని, భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరి హారాన్ని కొత్త భూసేకరణ చట్టం ప్రకారం ఇవ్వడం లేదని వాపోయారు. జల్లేరు నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్ సీపీ తరఫున గట్టిగా పోరాడతామని హామీ ఇచ్చిన జగన్ ముందుకు కదిలారు.
 
జీలుగుమిల్లి మండలం రాచన్నగూడెం గ్రామానికి చెందిన ఉకుంతరావుల మహాలక్ష్మమ్మ డ్వాక్రా రుణం చెల్లించాలంటూ బ్యాంక్ నుంచి తనకు అందిన నోటీసును జగన్‌కు చూపించింది. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుండా డ్వాక్రా మహిళలను మోసం చేసిన చంద్రబాబుపై కేసు పెట్టకుండా డ్వాక్రా మహిళలకు నోటీసులు ఇవ్వడం దారుణమని వైఎస్ జగన్ అన్నారు. అక్కడి నుంచి అశ్వారావుపేట చేరుకున్న ఆయనకు ఘనస్వాగతం లభించింది.
 
అక్కడ వైఎస్ విగ్రహానికి పూల మాలవేసి కుక్కునూరు చేరుకున్నారు. ఎదురొచ్చి స్వాగతం పలికిన గ్రామస్తులు తమ సమస్యలను ఏకరువు  పెట్టారు. గ్రామంలో జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించిన వైఎస్ జగన్ వారికి మద్దతు ప్రకటించారు. అనంతరం భారీ బహిరంగ సభలో మాట్లాడారు. అక్కడి నుంచి వేలేరు వెళ్లడానికి మూడు గంటలు పట్టింది. ప్రతిచోట ప్రజలు అడ్డం పడి తమ గ్రామానికి రావాలని కోరారు. ఉప్పేరు ప్రజల కోరిక మేరకు ఆ గ్రామంలోకి నడుచుకుంటూ వెళ్లిన జగన్ వారితో ముచ్చటించారు.
 
 వేలేరులో హాజరైన భారీ జనసందోహాన్ని ఉద్దేశించి మాట్లాడిన అనంతరం ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించి హైదరాబాద్ వెళ్లారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు ఆళ్ల నాని, నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప అప్పారావు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్యేలు తెల్లం బాలరాజు, ముదునూరి ప్రసాదరాజు, ఘంటా మురళీరామకృష్ణ, కారుమూరి నాగేశ్వరరావు, తానేటి వనిత, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు తలారి వెంకట్రావు, పుప్పాల వాసుబాబు, కొఠారు రామచంద్ర రావు, పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు కారుమంచి రమేష్, పార్టీ సీనియర్ నాయకులు కనమతరెడ్డి శ్రీనివాసరెడ్డి, పార్టీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు వందనపు సాయి బాలపద్మ, నాయకులు ఊదరగొండ చంద్రమౌళి, అశోక్‌రెడ్డి, ఎన్‌ఆర్‌ఐ విభాగం నాయకులు దిరిశాల కృష్ణ శ్రీనివాస్ పాల్గొన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement