సాక్షి ప్రతినిధి, కడప: ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం జిల్లాలో పర్యటించనున్నారని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తెలిపారు. పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు విమానంలో చేరుకుని ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు మార్గాన జిల్లాలోని పెండ్లిమర్రి మండలం మాచునూరు గ్రామానికి రానున్నారు.
ఆ గ్రామంలో నిర్వహిస్తున్న చావలి ఎల్లమ్మ, గంగమ్మ తిరునాలలో పాల్గొంటారు. అక్కడి నుంచి కడపకు బయలుదేరి వెళతారు. కామెర్ల వ్యాధితో తీవ్ర అనారోగ్యానికి గురై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొంది ఇటీవలే ఇంటికి చేరుకున్న వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు జిఎన్ మూర్తి ఇంటికి వెళ్లి పరామర్శించనున్నారు. అనంతరం పలువురు నూతన దంపతులకు ఆశ్వీరాదాలు, పరామర్శ కార్యక్రమాలు చేపట్టనున్నారు.
ఇటీవల అట్లూరు మాజీ ఎంపీపీ బాలమునిరెడ్డి కుమారుడి వివాహమైంది. నూతన జంటను ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశీర్వదించనున్నారు. ఆర్టీసీ బస్టాండు సమీపంలో ప్రముఖ వైద్యుడు మధుసూదన్‌రెడ్డి నూతనంగా ప్రారంభించిన మోహన్ ఆస్పత్రిని సందర్శించనున్నారు. అలాగే జయరాజ్ గార్డన్లో బుధవారం వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి మేనకోడలు రేష్మారెడ్డి వివాహమైంది. ఆ జంటను కూడా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశీర్వదించనున్నారు. అనంతరం రాత్రికి పులివెందులలో బసచేసి శుక్రవారం ఉదయాన్నే ఆళ్లగడ్డకు బయలుదేరి వెళతారు. అక్కడ దివంగత ఎమ్మెల్యే భూమా శోభానాగిరెడ్డి వర్ధంతి వేడుకలకు ఆయన హాజరు కానున్నారు.
నేడు జగన్ పర్యటన
Published Thu, Apr 23 2015 3:20 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్‌లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్‌మన్ గిల్‌కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్‌గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్‌కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement