వైఎస్‌ఆర్‌సీపీ హవా | Sakshi
Sakshi News home page

వైఎస్‌ఆర్‌సీపీ హవా

Published Sun, Jan 5 2014 2:20 AM

YSRCP sucessful in society elections

సాక్షి, కడప : జిల్లాలో శాంతి భద్రతలతోపాటు వివిధ కారణాలతో వాయిదా పడిన సొసైటీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ సత్తా చాటింది. జిల్లావ్యాప్తంగా 21 సొసైటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో 12 సొసైటీలు నామినేషన్ల దశలో ఆగిపోగా, 8 సొసైటీలు పోలింగ్ దశలో ఆగిపోయాయి. ఒక్క బ్రాహ్మణపల్లె ఓటర్ల జాబితా ప్రచురణ నోటిఫికేషన్ వెలువడకుండానే ఆగిపోయింది.
 
 నామినేషన్ల దశలో ఆగిపోయిన 12 సొసైటీలలో నామినేషన్ల ఉపసంహరణ గత ఆదివారం సాయంత్రంతో ముగియడంతో ఏడు స్థానాల్లో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులు ఆధిక్యాన్ని ప్రదర్శించి సొసైటీలను కైవసం చేసుకోగలిగారు. అనంతయ్యగారిపల్లె 13 డెరైక్టర్ స్థానాలు, అనంతసముద్రం 13, పెనగలూరు 7, బి.కోడూరు 10, చిన్నకేశంపల్లె 9, కొలిమివాండ్లపల్లె 9, మద్దిరేవుల వైఎస్‌ఆర్‌సీపీ 8, కాంగ్రెస్ 5 డెరైక్టర్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.అలాగే గొర్లముదివీడు 13డెరైక్టర్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఈ డెరైక్టర్ స్థానాలన్నింటినీ వైఎస్‌ఆర్‌సీపీ అనుకూల అభ్యర్థులు కైవసం చేసుకోవడంతో ఎనిమిది సొసైటీల్లో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులే సొసైటీ ఛెర్మైన్లుగా ఎన్నిక కానున్నారు.
 
 ఏకపక్షంగా కమలాపురం...
 కమలాపురం నియోజకవర్గంలో యల్లటూరు, వల్లూరు, గోనుమాకులపల్లె, నాగిరెడ్డిపల్లె ఎన్నికలు కేవలం లాంఛనంగా మాత్రమే నిర్వహిస్తున్నారు.గోనుమాకులపల్లె, యల్లటూరు, నాగిరెడ్డిపల్లె వైఎస్సార్‌సీపీ ఖాతాలో ఇదివరకే చేరిపోయాయి. అందుకు కారణం పోటీదారులు ఇటీవల వైఎస్సార్‌సీపీకి మద్దతు ప్రకటించడమే. అప్పటికే నామినేషన్లు దాఖలు చేసి ఉండటంతో ఎన్నిక అనివార్యమైంది. వల్లూరులో మాత్రమే పోటీ ఉంది. అక్కడ రైతులంతా వైఎస్సార్‌సీపీకి బహిరంగంగా మద్దతు ప్రకటిస్తున్నారు. దీంతో ఆ సొసైటీ సైతం వైఎస్సార్‌సీపీని వరించనుంది. మొత్తంమీద కమలాపురం నియోజకవర్గం ఏకపక్షంగా వైఎస్సార్‌సీపీ పక్షాన నిలవనుంది.
 

Advertisement
Advertisement