నిలదీత.. ఉదాసీనత | Sakshi
Sakshi News home page

నిలదీత.. ఉదాసీనత

Published Mon, Aug 18 2014 12:45 AM

నిలదీత.. ఉదాసీనత

 ఏలూరు:కొల్లేరు జిరాయితీ భూముల్లో పంటలు సాగుకు అనుమతి ఇవ్వడం.. లేదంటే భూముల యజమానులకు నష్టపరిహారం చెల్లించడం అనే అంశాల్లో ఏదో ఒకదానిపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని కోరుతూ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం తీర్మానించింది. ఇసుక రీచ్‌లపై ప్రభుత్వం కొత్త విధానం ప్రకటించే వరకు స్ధానికంగా లభ్యమయ్యే ఇసుకను పేదల ఇళ్ల నిర్మాణానికి ఉచితంగా అందించేలా ప్రభుత్వా న్ని కోరటం.. జెడ్పీ కార్యాలయ ప్రాంగణంలో నాయకుల విగ్రహాల ఏర్పాటు.. జెడ్పీ సమావేశ మందిరానికి పేరుపెట్టే అంశాలపైనా తీర్మానాలను ఆమోదిం చారు. జెడ్పీ అధ్యక్షుడు ముళ్లపూడి బాపిరాజు అధ్యక్షతన ఆదివారం సర్వసభ్య సమావేశం జరిగింది. జిల్లాలో నెలకొన్న వివిధ సమస్యలను జెడ్పీటీసీలు, ఎంపీపీలు ఏకరువు పెట్టారు.
 
 అజెండాలో పలు కీలక అంశాలు పొందుపర్చినప్పటికీ నూతన ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యలను అధికారులు దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. దాదాపు నాలుగు గంటలపాటు సాగిన సమావేశంలో సభ్యులు లేవనెత్తిన ఏ ఒక్క సమస్యకు ఉన్నతస్థారుు ప్రజాప్రతినిధులు, అధికారులు పరిష్కార మార్గం చూపలేకపోయూరు. స్త్రీ, శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత మాట్లాడుతూ జిల్లాను ఉన్నత స్థారుులో నిలి పేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. అర్హులైన పేదలకు ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని, రోడ్లు, డ్రెరుునేజీ, తాగు, సాగునీటి సమస్యలను సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నదృష్ట్యా ఆదాయ వనరుల్ని అన్వేషించాలన్నారు. జిల్లాలో ఇసుక కొరత నివారణకు త్వరలో కొత్త విధానం తీసుకొస్తామని చెప్పారు.
 
 టీడీపీ వాళ్లకు గౌరవం ఇవ్వాల్సిందే
 ఏలూరు ఎంపీ మాగంటి బాబు, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, ఎమ్మెల్యేలు అధికారులపై దర్పాన్ని ప్రదర్శించడానికే ఎక్కువ సమయం కేటారుుంచారు. మండలాల్లో ఉండే టీడీపీ ప్రజాప్రతినిధులకు యంత్రాంగం గౌరవం ఇచ్చి తీరాల్సిందేనని పదేపదే కోరారు. అధికారులెవరూ ప్రోటోకాల్ పాటించడం లేదంటూ ఎంపీ మాగంటి బాబు అసహనం ప్రదర్శించారు. జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు మాట్లాడుతూ జిల్లాను అన్నిరంగాల్లో అగ్రభాగాన నిలిపిందేకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాన్నారు. గ్రామాల్లో అక్రమంగా ఇసుక, మట్టి విక్రయాలను అడ్డుకుని స్థానిక ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.  
 
 సమస్యలపై ఇలా..
 కొల్లేరు కాంటూరు కుదింపు, హాస్టళ్లలో నెలకొన్న సమస్యలు, మురుగునీటి పారుదల సక్రమంగా లేకపోవడం, ఇళ్లు నిర్మించుకున్న పేదలకు బిల్లులు పంపిణీలో జాప్యం, ఉపాధి హామీ పథకంలో ఇక్కట్లు, పింఛను లబ్ధిదారులు కిలోమీటర్ల కొద్దీ ప్రయాణించి పోస్టాఫీసుల వద్ద పడిగాపులు పడుతున్న తీరుపై పలువురు సభ్యులు అధికారులను నిలదీశారు. వీరవాసరం జెడ్పీటీసీ సభ్యుడు మానుకొండ ప్రదీప్ మాట్లాడుతూ నవుడూరు-అండలూరు, నవుడూరు- వీరవాసరం రోడ్లు అధ్వానంగా తయూరయ్యూయని, ఆ రోడ్లపై ప్రయూణం నరకప్రాయంగా ఉందని చెప్పారు. వీరవాసరం ఎంపీపీ కవురు శ్రీనివాస్ వివిధ సమస్యలను సమావేశం దృష్టికి తీసుకొచ్చారు.
 
 పెదవేగి జెడ్పీటీసీ కె.విద్యాసాగర్ వ్యవసాయ అవసరాలకు 7 గంటలపాటు నిరాటకంగా విద్యుత్ సరఫరా చేయూలని డిమాండ్ చేశారు. సమావేశంలో కలెక్టర్ కాటమనేని భాస్కర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బొమ్మారెడ్డి నాగచంద్రారెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ భూపతిరాజు రవివర్మ, జెడ్పీ సీఈవో డి.వెంకటరెడ్డి, డీపీవో అల్లూరి నాగరాజువర్మ, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఈ బి.రమణ, డీఆర్‌డీఏ పీడీ పి.శ్రీనివాసులు, ఈపీడీసీఎల్ ఎస్‌ఈ టీవీ సూర్యప్రకాష్, వ్యవసాయ శాఖ జేడీ వి.సత్యనారాయణ, ఉద్యానశాఖ ఏడీ ఎస్.సుజాత, డ్వామా పీడీ ఎన్.రామచంద్రారెడ్డి, పశు సంవర్థక శాఖ జేడీ డాక్టర్ కె.జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు.
 
 ప్రజాప్రతినిధులు ఏమన్నారంటే...
 ఎంపీ మాగంటి బాబు మాట్లాడుతూ కొల్లేరు కాంటూర్ కుదింపుపై ఇచ్చిన హామీని త్వరలోనే నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. కృష్ణా జిల్లా నుంచి కొల్లేటి కోటకు వెళ్లేందుకు వీలుగా వంతెన నిర్మించేందుకు అన్ని అనుమతులు సాధించామన్నారు. ద్వారకాతిరుమల ప్రాంతంలో సిరామిక్ హబ్ ఏర్పాటుకు గుజరాత్ పారిశ్రామికవేత్తల సాయం తీసుకుంటామన్నారు. సిరామిక్ పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తే 30వేల మందికి ఉపాధి కల్పించవచ్చన్నారు. ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ జిల్లాలో అధికారుల తీరు ఏమాత్రం బాగాలేదన్నారు. ఇసుక, మట్టిని అక్రమంగా దోచుకుంటున్న అధికారులు అభివృద్ధి పనులను పట్టించుకోవడం లేదన్నారు.
 
 నిబంధనలతో కాలయాపన చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టడం మంచి పద్దతి కాదు. నిడదవోలు ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు జెడ్పీ సీఈవో వెంకటరెడ్డి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశ అజెండాను సభ్యులకు వారం రోజుల ముందుగా ఎందుకు పంపలేదని నిలదీశారు. ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ మాట్లాడుతూ ప్రతిపక్షం లేదని గర్వపడకుండా.. జిల్లా అభివృద్దికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మం త్రుల సహకారంతో జెడ్పీటీసీలు ముం దుకు సాగాలని సూచించారు. నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు మాట్లాడుతూ తన నియోజకవర్గంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని, అక్కడ పరిశ్రమల స్థాపనకు యంత్రాంగం చర్యలు తీసుకోవాలని కోరారు.
 
 పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ తన నియోజకవర్గంలో సాగునీటి సమస్యతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఇసుక కొరత కారణంగా డెల్టా ఆధునికీక రణ పనులు ముందుకు సాగడం లేదన్నారు. కొవ్వూరు ఎమ్మెల్యే కేఎస్ జవహర్ మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అన్నిచర్యలు తీసుకోవాలని కోరారు. కొవ్వూరు నియోజకవర్గం వరదలతో అతలాకుతలం అవుతోందని, డెల్టా ఆధునికీకరణలో డ్రెయిన్లు, కాలువ పనులు చేపట్టాలని కోరారు. ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి సాగునీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ కొల్లేరు కాంటూర్ కుదింపు ప్రక్రియను వేగవంతం చేయూలని కోరారు.
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement