ఆదాయ పన్ను చెల్లింపులో కొత్త ఎత్తుగడ | Sakshi
Sakshi News home page

ఆదాయ పన్ను చెల్లింపులో కొత్త ఎత్తుగడ

Published Sun, Jul 23 2017 12:59 PM

ఆదాయ పన్ను చెల్లింపులో కొత్త ఎత్తుగడ - Sakshi

న్యూఢిల్లీ: ఆధార్‌ కార్డు వివరాలు తెలపడం ఇష్టం లేని చాలామంది పన్ను చెల్లింపులకు కొత్త మార్గాలను కనుగొంటున్నారు. దేశ వ్యాప్తంగా అనేక మంది పన్ను చెల్లింపు దారులు తమ ఆదాయపు పన్నును మాన్యువల్‌గా చెల్లించారు. చాలా మంది జూన్ 30 వ తేదీకి ముందే తమ ఆదాయపన్నును ఆన్ లైన్ లో దాఖలు చేశారు.  ఎందుకంటే జూన్‌ 30కు ముందు ఆధార్‌ కార్డు తప్పనిసరి కాకపోవడంతో ఎక్కువ మంది తమ పన్నును ముందుగానే రిటర్న్‌ చేశారు. ఈ ఫిల్లింగ్‌ వ్యవస్థలో లోపం వల్ల ఆధార్ కార్డు లేకపోతే ఆన్‌లైన్‌లో చెల్లించడానికి ఇ-ఫిల్లింగ్ వ్యవస్థలో వీలవదు. కొన్ని సందర్భాల్లో దరఖాస్తు సైతం తిరస్కరించబడుతుంది. కానీ రూ.5లక్షల ఆదాయం ఉన్నవారు ఖచ్చింతగా తమ ఆధార్‌ కార్డు నెంబర్‌ను జత చేయాల్సి ఉంటుంది. కానీ జత చేసిన ఆధార్‌కార్డు వివరాలకు భద్రత లేదని ప్రముఖ చిత్ర నిర్మాత రాకేష్‌ శర్మ అన్నారు.

బెంగళూరుకు చెందిన కన్సల్టెంట్ తనభర్తతో, వారి స్నేహితులు పన్ను చెల్లింపులకు ఆధార్ కార్డు జత చేయడానికి నిరాకరించారని తెలిపింది. ఆధార్ డేటా ఆన్‌లైన్‌లో చోరీకి గురౌంతుందని అందువల్లే తాము ఆధార్‌కార్డును జత చేయలేదన్నారు. ఇంకా కొన్ని బ్యాంకులు వినియోగదారులను ఆధార్‌ కార్డుతో అనుసంధానం చేసుకోమని లేకపోతే లావాదేవీలు స్థంభింప చేస్తామని బెదిరింపులకు పాల్పడుతోందని ఆమె వాపోయింది. చాలా మంది వినియోగదారులు తమ ఆధార్‌కార్డును జత చేయడానికి ఇష్టపడట్లేదు. కావాలంటే ఓటర్‌ కార్డుతో జత చేసుకోవాలని సూచిస్తున్నారు.

ఆదాయ పన్ను చట్టం యొక్క సెక్షన్ 139ఏఏ ప్రకారం ఆదాయపన్ను రిటర్న్స్‌ దరఖాస్తుకు జులై 1 నుంచి ఆధార్ నంబర్ తప్పనిసరి చేసింది. జూన్ 9 న, సుప్రీం కోర్టు బెంచ్ దీనిని సమర్థించింది. అయితే ఆధార్‌ సమాచార భద్రతపై వచ్చిన పలు సందేహాలను పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు దానిని తాత్కాలికంగా రద్దు చేసింది. కానీ పాన్‌కార్డు తప్పని సరి చేసింది. జూలై 1నుంచి ఐటి రిటర్న్స్ దాఖలు చేయడానికి పన్ను ఆధార్‌ తప్పనిసరి. చెల్లింపుదారులకు ఆధార్ కార్డు లేకపోతే, పన్ను చెల్లింపుదారులు ఆధార్ నమోదు సంఖ్యను జతపరచాలని ఒక సీనియర్ అధికారి తెలిపారు. ఆధార్‌ అనుసంధానం కొన్ని సందర్భాల్లో, కొందరికి మాత్రమే ఉపశమనం లభించింది. విదేశీయులు, ఎన్నారైలు, అస్సాం, మేఘాలయ, జమ్మూ కశ్మీర్‌లో ఉంటున్న 80ఏళ్లు పైబడిన వారు ఆధార్‌ కార్డు జత పరచాల్సిన అవసరం లేదు.

5 లక్షల రూపాయలకు పైన సంపాదించిన వారికి మాన్యువల్ రిటర్న్ చెల్లిస్తామని ఐటీ అధికారులు చెప్పుకుంటున్నారని కానీ వాటిని అంగీకరించడానికి అవకాశం లేదని ఒక చార్టర్డ్ అకౌంటెంట్ చెప్పుకొచ్చాడు. సరైన సమయంలో రిటర్న్‌ దాఖలు చేస్తే ఆలస్య రుసుము రూ.10వేలు  ఈఏడాదికి పడే అవకాశం లేదని మరోక నిపుణుడు తెలిపారు. మరికొంత మంది మాన్యువల్‌ దరఖాస్తులను అంగీకరించమని ఆదాయపన్ను కమీషనర్‌ వద్దకు వెళ్తున్నారని, సరైన కారణం లేకుండా అందుకు అంగీకరించే అవకాశం లేదని ఆయన అన్నారు. ప్రస్తుతరం సెక్షన్ 139ఏఏపై తుది నిర్ణయం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. దీంతో ఆధార్‌ కార్డు లేకుండా దాఖలు  చేసే ఐటీ రిటర్న్సను నిరాకరించే అవకాశం లేదనే వాదన ఉంది. పన్ను చెల్లింపుదారులు మాన్యువల్‌గా దాఖలు చేసినటప్పటికి, గతంలో ఏదైనా బకాయిలు ఉంటే,  చెల్లింపులను వాపసు పొందలేరు. దీని కోసం, తిరగి ఆన్‌లైన్‌లో ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది.

Advertisement
Advertisement