నేటి నుంచి ఎయిర్ ఏషియా విమాన సర్వీసులు | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఎయిర్ ఏషియా విమాన సర్వీసులు

Published Thu, Jun 12 2014 1:04 AM

నేటి నుంచి ఎయిర్ ఏషియా విమాన సర్వీసులు

తొలి విమానం బెంగళూరు-గోవాకు
ముంబై: ఎయిర్ ఏషియా ఇండియా విమాన సర్వీసులు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. దీంతో దేశీయ విమానయాన రంగంలో తీవ్రమైన పోటీకి తెర లేచిందని నిపుణులంటున్నారు. ఇండిగో, స్పైస్‌జెట్, గో ఎయిర్, జెట్‌లైట్‌ల  తరహాలో ఎయిర్ ఏషియా కూడా చౌక విమానయాన  సర్వీసులను అందిస్తుంది.  టోనీ ఫెర్నాండెస్ నేతృత్వంలోని మలేసియా విమానయాన సంస్థ,  ఎయిర్ ఏషియా, టాటా సన్స్, అరుణ్ భాటియాకు చెందిన టెలిస్ట్రా ట్రేడ్‌ప్లేస్‌లు కలసి 49:30:21 భాగస్వామ్యంతో ఎయిర్ ఏషియా ఇండియా సంస్థను ఏర్పాటు చేశాయి.
 
టైర్ టూ నగరాలపై దృష్టి
 ఎయిర్ ఏషియా ఇండియా తొలి విమానం నేడు బెంగళూరు నుంచి గోవాకు 3.10 గంటలకు ప్రారంభం కానున్నది. అత్యంత చౌక ధరలకే విమానయానాన్ని అందిస్తామంటున్న ఎయిర్ ఏషియా ఇండియా సంస్థ టైర్ టూ నగరాలపై  దృష్టి కేంద్రీకరిస్తోంది.  బెంగళూరు-గోవా, బెంగళూరు-చెన్నైలకు విమాన చార్జీలను రూ.999కే అందించడం ద్వారా ఈ సంస్థ ఇప్పటికే ధరల పోరుకు తెర తీసింది. ఈ బుకింగ్స్ ప్రారంభమైన 10 నిమిషాలకే  టికెట్లన్నీ అమ్ముడయ్యాయి.

Advertisement
Advertisement