మార్చికల్లా అన్ని గ్రామాలకూ ఉచిత వైఫై: రవిశంకర్‌ ప్రసాద్‌ | Sakshi
Sakshi News home page

మార్చికల్లా అన్ని గ్రామాలకూ ఉచిత వైఫై: రవిశంకర్‌ ప్రసాద్‌

Published Thu, Dec 26 2019 4:21 AM

All villages to have free WiFi services by March 2020 - Sakshi

రేవారి (హర్యానా): భారత్‌నెట్‌ ప్రాజెక్టు పరిధిలోని అన్ని గ్రామాలకూ వచ్చే మార్చి వరకు వైఫై ఉచితంగా అందిస్తున్నామని కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ బుధవారం హర్యానాలోని రేవారికి వచ్చిన సందర్భంగా చెప్పారు. ‘‘భారత్‌నెట్‌ ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ను ఇప్పటికే 1.3 లక్షల గ్రామ పంచాతీయలకు అనుసంధానించాం. 2.5 లక్షల గ్రామ పంచాయతీలను చేరుకోవాలన్నది లక్ష్యం. భారత్‌నెట్‌ సేవలను ప్రోత్సహించేందుకు గాను ప్రాజెక్టు పరిధిలోని అన్ని గ్రామాల్లోనూ 2020 మార్చి వరకు ఉచితంగా వైఫై సేవలను అందిస్తున్నాం. భారత్‌ నెట్‌వర్క్‌కు అనుసంధానమైన మొత్తం గ్రామాల్లో ప్రస్తుతానికి 48,000 గ్రామాల్లో వైఫై సేవలు అందుబాటులో ఉన్నాయి’’ అని మంత్రి వెల్లడించారు.

Advertisement
Advertisement