పీఎంపీ నిబంధనల్లో మార్పులు కోరిన యాపిల్‌ | Sakshi
Sakshi News home page

పీఎంపీ నిబంధనల్లో మార్పులు కోరిన యాపిల్‌

Published Fri, Jun 9 2017 12:57 AM

పీఎంపీ నిబంధనల్లో మార్పులు కోరిన యాపిల్‌ - Sakshi

న్యూఢిల్లీ: టెక్నాలజీ దిగ్గజం యాపిల్‌ తాజాగా ఫేజ్‌డ్‌ మాన్యుఫాక్చరింగ్‌ ప్రోగ్రామ్‌ (పీఎంపీ)లో కొన్ని మార్పులు చేర్పులు అవసరమని కోరింది. కంపెనీ భారత్‌లో ప్లాంటును ఏర్పాటు చేయాలని భావిస్తోన్న విషయం తెలిసిందే. ఉపకరణాల తయారీలో ఉపయోగించే పలు విడిభాగాలు, యాక్ససరీస్‌పై పన్ను ప్రోత్సాహకాలు, ఇతర ప్రయోజనాలు అందించడం ద్వారా దేశంలో మొబైల్‌ ఫోన్ల తయారీని పెంచాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పీఎంపీ కార్యక్రమాన్ని ఆవిష్కరించింది.

‘డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ (డీఈఐటీవై) యాపిల్‌ అంశంపై దృష్టిసారించింది. మొబైల్స్‌ విడిభాగాలకు సంబంధి పన్నుల నిర్మాణంపై వారు పూర్తి స్పష్టత కోరుకుంటున్నారు. ప్రస్తుత పీఎంపీ ప్రకారమైతే యాపిల్‌ ప్రణాళికలు కార్యరూపం దాల్చేలా లేవు’ అని ఒక అధికారి తెలిపారు. ఇక డీఈఐటీవై కూడా విడిభాగాల ప్రాతిపదికన యాపిల్‌తో చర్చలు జరుపుతోందన్నారు.

Advertisement
Advertisement