ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌తో ఎన్నో ప్రయోజనాలు

24 Jun, 2019 10:52 IST|Sakshi

పర్యాటకులు సెలవుల్లో ఏఏ ప్రాంతాలు చుట్టి రావాలన్న ప్రణాళికకే ఎంతో సమయం, కష్టాన్ని వెచ్చిస్తుంటారు. అయితే, ఎక్కువ మంది ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ను మాత్రం పట్టించుకోరు. ప్రయాణ సమయాల్లో ప్రమాదాలు, అనారోగ్యం పాలయ్యే రిస్క్‌ ఉంటుంది. ఊహించని, దురదృష్టకర ఘటనలు జరగకుండా తప్పించుకునే మార్గం లేదు. పర్యాటక బీమా అన్నది ఈ తరహా ప్రమాదాలు జరగకుండా నిరోధించలేదు. కానీ, ఈ తరహా సందర్భాల్లో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ పర్యాటకులకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. ప్రమాదాలు లేదా ప్రయాణ సమయాల్లో అనారోగ్యం పాలైతే, ఎదురయ్యే వైద్య ఖర్చులను ఈ బీమా భరిస్తుంది. కొన్ని దేశాల్లో వైద్య చికిత్సల వ్యయాలు భారీగా ఉంటాయని తెలుసుకోవాలి. దీంతో తీవ్రమైన గాయాల పాలయితే పర్యాటకులు వేలాది డాలర్లను వైద్య బిల్లుల రూపంలో చెల్లించుకోవాల్సి వస్తుంది. అదే పర్యాటక ఇన్సూరెన్స్‌ ఉంటే తమ వైద్యం కోసం చేసిన ఖర్చులను రీయింబర్స్‌మెంట్‌ రూపంలో తిరిగి పొందొచ్చు. పైగా వైద్య పరంగా అత్యవసర తరలింపునకు అయ్యే ఖర్చులను కూడా పాలసీదారులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. మరో ముఖ్యమైన ప్రయోజనం... ట్రిప్‌ను రద్దు చేసుకుంటే, లేదా అవాంతరాలు ఎదురైనా కవరేజీ లభిస్తుంది. పర్యటనకు ముందుకానీ, పర్యటన సమయంలో కానీ ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే, పర్యాటకులు తమ పర్యటనలను కుదించుకోవడం లేదా రద్దు చేసుకోవాల్సి వస్తుంది. దీనివల్ల భారీ మొత్తంలో నష్టపోతుంటారు.

ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ ఉంటే ఈ తరహా పర్యటనల రద్దు, కుదింపు సమయాల్లో ఎదురయ్యే నష్టాలకు పరిహారాన్ని చెల్లిస్తుంది. ఈ పాలసీ ఉండడం వల్ల బ్యాగేజీ లేదా వ్యక్తిగత వస్తువులు కోల్పోయినా, పరిహారం పొందొచ్చు. ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ కింద కవరేజీ లభించే వాటిల్లో వ్యక్తిగత బాధ్యత, పర్యటన ఆలస్యం, ప్రమాద మరణం, భౌతిక కాయాన్ని తరలించడం, దంత వైద్య వ్యయాలకూ కవరేజీ ఉంటుంది. కేవలం పర్యటనల సమయాల్లో కవరేజీకే పరిమితం కాకుండా, ఊహించని ఘటనలు ఎదురైతే ఎలా ఎదుర్కోవాలి, ముఖ్యమైన సౌకర్యాలు ఇతర సమాచారాన్ని పాలసీదారులు రోజులో 24 గంటల పాటు పొందే అవకాశం కూడా ఉంది. ప్రయాణ సమయంలో డాక్యుమెంట్లు పోయినా పాలసీ ఆదుకుంటుంది. కుటుంబ సభ్యులతో కలసి చేసే పర్యటనలు ఎంతో అనందాన్నిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే, బయటకు వెళ్లినప్పుడు ముప్పు లేదా ప్రమాదాలు ఎదురుకాకుండా బయటపడే ఎటువంటి మార్గం ఉండదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎవరైనా కానీ ఏదైనా ట్రిప్‌కు వెళ్లి రావాలనుకుంటే, అది స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో అయినా కానీ, ముందుగా ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌కు కూడా ప్లాన్‌ చేసుకోవాలి. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అజీం ప్రేమ్‌జీ అండతో ఆ స్టార్టప్‌ అరుదైన ఘనత

కార్పొరేట్‌ బ్రదర్స్‌ : అనిల్‌ అంబానీకి భారీ ఊరట

లాభాల్లోకి మార్కెట్లు : బ్యాంక్స్‌ జూమ్‌

రెడ్‌మి కే 20 ప్రొ వచ్చేసింది

రెడ్‌మి కే20 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ : బిగ్‌ సర్‌ప్రైజ్‌

స్వల్ప లాభాలతో స్టాక్‌మార్కెట్లు

మార్కెట్లోకి ‘స్కోడా రాపిడ్‌’ లిమిటెడ్‌ ఎడిషన్‌

‘ఐటీఆర్‌ ఫామ్స్‌’లో మార్పుల్లేవ్‌..

ఇక ‘స్మార్ట్‌’ మహీంద్రా!

సు‘జలం’ @ 18.9 లక్షల కోట్లు!

విప్రోకు ఉజ్వల భవిష్యత్‌: ప్రేమ్‌జీ

ప్రైమ్‌ డే సేల్ ‌: అమెజాన్‌కు షాక్‌

నేటి నుంచీ కియా ‘సెల్టోస్‌’ బుకింగ్స్‌ ప్రారంభం

ఎక్కడైనా వైఫై కనెక్టివిటీ !

అశోక్‌ లేలాండ్‌ ప్లాంట్‌ తాత్కాలిక మూసివేత

కొనుగోళ్ల జోష్‌ : లాభాల్లోకి సూచీలు 

ఎయిరిండియాకు భారీ ఊరట

ఫ్లాట్‌గా స్టాక్‌మార్కెట్లు

మందగమనానికి ఆనవాలు!

27 ఏళ్ల కనిష్టానికి చైనా వృద్ధి రేటు

జీవీకే ఎయిర్‌పోర్టులో 49% వాటా విక్రయం!

మార్కెట్లో ‘వాటా’ ముసలం!

మహిళల ముంగిట్లో డిజిటల్‌ సేవలు : జియో

బడ్జెట్‌ ధరలో రియల్‌మి 3ఐ

అద్భుత ఫీచర్లతో రియల్‌ మి ఎక్స్‌ లాంచ్‌

లాభనష్టాల ఊగిసలాట

రెండేళ్ల కనిష్టానికి టోకు ధ‌ర‌ల ద్ర‌వ్యోల్బ‌ణం

16 పైసలు ఎగిసిన రూపాయి

భారీ లాభాల్లో మార్కెట్లు : ఇన్ఫీ జూమ్‌

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ షాపింగ్‌ డేస్‌ సేల్‌ : భారీ ఆఫర్లు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హైకోర్టులో ‘బిగ్‌బాస్‌’ కి ఊరట

‘చెట్ల వెంట తిరుగుతూ డాన్స్‌ చేయలేను’

కండలవీరుడికి కబీర్‌ సింగ్‌ షాక్‌

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!

తమన్నా ప్లేస్‌లో అవికానా!

‘పూరి ముఖంలో సక్సెస్‌ కనిపించింది’