మీ మొబైల్‌లో డేటా స్టాప్ చేస్తారా? | Sakshi
Sakshi News home page

మీ మొబైల్‌లో డేటా స్టాప్ చేస్తారా?

Published Sat, Aug 8 2015 8:19 AM

మీ మొబైల్‌లో డేటా స్టాప్ చేస్తారా?

♦ 1925కి కాల్/ఎస్‌ఎంఎస్ చేస్తే చాలు
♦ యాక్టివేషన్‌కు కూడా ఇదే నంబర్
♦ సెప్టెంబర్ 1 నుంచి అందుబాటులోకి
 
  న్యూఢిల్లీ : మొబైల్ ఫోన్లలో ఇంటర్నెట్ సర్వీసులను యాక్టివేట్/డీయాక్టివేట్ చేసుకోదల్చుకున్నవారి కోసం సెప్టెంబర్ 1 నుంచి ప్రత్యేక నంబరు అందుబాటులోకి వస్తోంది. దీనికోసం ఇకపై 1925 నంబరుకి (టోల్ ఫ్రీ) కాల్ చేసినా లేదా ఎస్‌ఎంఎస్ చేసినా సరిపోతుంది. అదనపు ఆదాయం పొందే ఉద్దేశంతో టెలికం సంస్థలు మొబైల్ డేటా డీయాక్టివేషన్ ప్రక్రియను చాలా సంక్లిష్టంగా మార్చేస్తున్నాయంటూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ట్రాయ్ ఈ మేరకు చర్యలు తీసుకుంది.

టెలికం ఆపరేటర్లు డేటా యాక్టివేషన్/డీయాక్టివేషన్‌కి సెప్టెంబర్ 1 నుం చి 1925 నంబరును అందుబాటులోకి తేవాలని ఆదేశించింది. యాక్టివేషన్ కావాలనుకునేవారు ఇంగ్లీషులో స్టార్ట్ అని, డీయాక్టివేషన్ చేసుకోదల్చుకున్నవారు స్టాప్ అని ఈ నంబరుకు ఎస్‌ఎంఎస్ చేయొచ్చు. టెలికం ఆపరేటర్లు తక్షణమే సదరు సర్వీసు పరిస్థితి గురించి కస్టమరుకు తెలియజేయాల్సి ఉంటుంది.

 కొత్త నిబంధనల ప్రకారం 500 ఎంబీ, 1జీబీ, 2జీబీ తదితర డేటా పరిమితుల దాకా యూజరు ముందస్తుగా ఇచ్చిన సమ్మతి వర్తిస్తుంది. నిర్దేశిత పరిమితి దాటితే ప్రత్యేకంగా అనుమతి ఉండాల్సిందే. ఇక స్పెషల్ టారిఫ్ వోచర్లు (ఎస్‌టీవీ) లేదా కాంబో వోచర్ లేదా యాడ్ ఆన్ ప్యాక్ వంటి డేటా ప్యాక్‌లు తీసుకున్న వారు డేటా సర్వీసుల కోసం తమ అనుమతి ఇచ్చినట్లుగానే భావించడం జరుగుతుంది. డేటా ప్యాకేజీ కోసం సబ్‌స్క్రయిబ్ చేయకపోయినప్పటికీ.. అవసరాన్ని బట్టి వినియోగించుకునే వారికి ప్రతి 10 ఎంబీ డేటా విని యోగం తర్వాత టెల్కోలు అలర్ట్‌లు పంపాల్సి ఉంటుంది. కస్టమర్లు అంతర్జాతీయంగా రోమిం గ్‌లో ఉన్న సమయంలో డేటాను గానీ వినియోగించుకోకుండా ఉన్న పక్షంలో హ్యాండ్‌సెట్‌లో మొబైల్ ఇంటర్నెట్ సర్వీస్‌ను స్విచ్ ఆఫ్ చేయాలంటూ అలర్ట్ చేయాల్సి ఉంటుంది.

Advertisement
Advertisement