పెండింగ్ ‘మ్యాట్’ కేసులపై కేంద్రం వెనక్కు! | Sakshi
Sakshi News home page

పెండింగ్ ‘మ్యాట్’ కేసులపై కేంద్రం వెనక్కు!

Published Fri, Sep 4 2015 1:06 AM

పెండింగ్ ‘మ్యాట్’ కేసులపై కేంద్రం వెనక్కు! - Sakshi

న్యూఢిల్లీ: కనీస ప్రత్యామ్నాయ పన్నులు (మ్యాట్) కట్టాలని నోటీసులందుకున్న ఎఫ్‌ఐఐల కేసుల జోలికి ప్రస్తుతానికి వెళ్లొద్దని కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీ టీ) తమ క్షేత్ర స్థాయి అధికారులను ఆదేశించింది. ఏప్రిల్ 1కి పూర్వం కేసుల విషయంలో రికవరీలు ఆపేయాలని ఒక సర్క్యులర్‌లో సూచించింది. మ్యాట్ నిబంధనలపై ఆదాయ పన్ను చట్టాలకు తగు సవరణలు చేయనున్నట్లు సీబీడీటీ పేర్కొంది. ఏపీ షా కమిటీ సిఫార్సుల మేరకు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లపై (ఎఫ్‌ఐఐ) మ్యాట్ విధించొద్దంటూ కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో సీబీడీటీ ఈ ఆదేశాలు జారీ చేసింది.

Advertisement
Advertisement