Sakshi News home page

'ఫేస్ బుక్ పై కథనంలో వాస్తవం లేదు'

Published Mon, Sep 22 2014 2:52 PM

'ఫేస్ బుక్ పై కథనంలో వాస్తవం లేదు' - Sakshi

న్యూయార్క్: ఫేస్ బుక్ పై ఓ నేషనల్ వెబ్ సైట్ లో వచ్చిన వ్యంగ్య కథనంలో వాస్తవం లేదని ఆ కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. నవంబర్ 1 తేది నుంచి 2.99 డాలర్ల నెలవారి రుసుము వసూలు చేస్తున్నట్టు వచ్చిన వార్తలో నిజం లేదన్నారు. తాజా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తాము ఎలాంటి ఫీజును వసూలు చేయడం లేదని ఫేస్ బుక్ ఆ వార్తల్ని ఖండించింది. 
 
కథనంలో ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ చెప్పినట్టు వచ్చిన వార్తల్ని ఖండించారు. ఈ కథనంపై సోషల్ మీడియా యూజర్లు అసంతృప్తిని వెళ్లగక్కారు. చవకబారు కథనాలపై వివరణ ఇవ్వాలని యూజర్ల నుంచి ఫీడ్ బ్యాక్ వచ్చిందని ఫేస్ బుక్ ప్రతినిధి తెలిపింది. 

Advertisement

What’s your opinion

Advertisement