Sakshi News home page

హెచ్‌డీఎఫ్‌సీ రుణ రేటు పెంపు!

Published Fri, Aug 3 2018 1:04 AM

HDFC hikes loan rate - Sakshi

ముంబై: హౌసింగ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (హెచ్‌డీఎఫ్‌సీ) రుణరేటు స్వల్పంగా 20 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒక శాతం) పెరిగింది. ఆర్‌బీఐ పాలసీ రేటు పావుశాతం పెరిగిన (6.50 శాతానికి) నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ తన రుణ రేటును 0.20 శాతం పెంచింది. ‘‘గృహ రుణాలకు వర్తించే రిటైల్‌ ప్రైమ్‌ లెండింగ్‌ రేటును బ్యాంక్‌ 20 బేసిస్‌ పాయింట్లు పెంచింది.

ఈ పెంపు ఆగస్టు 1 నుంచి వర్తిస్తుంది’’ అని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో దేశీయ అతిపెద్ద తనఖా రుణ సంస్థ– హెచ్‌డీఎఫ్‌సీ పేర్కొంది. పెంపు ప్రకారం మహిళలకు రూ.30 లక్షల వరకూ రుణరేటు 8.7 శాతంగా ఉంటుంది. ఆపైన మొత్తానికి రూ.8.8 శాతంగా ఉంటుంది. ఇతర కస్టమర్లకు 5 బేసిస్‌ పాయింట్ల అదనపు రుణరేటు అమలవుతుంది. 

Advertisement

What’s your opinion

Advertisement